UPSC: 'సీడీఎస్‌ఈ' నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు ఇలా

దేశంలో త్రివిధ దళాలకు చెందిన అకాడమీల్లో ప్రవేశాల కోసం ‘కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్ (1) – 2020’ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్() బుధవారం (అక్టోబరు 30న) విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల), ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(చెన్నై)లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతప‌రీక్ష‌, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్స‌నాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టుల వివ‌రాలు..

✪ కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌ఈ) (1)-2020✦ ఖాళీల సంఖ్య: 418

అకాడమీల వారీగా ఖాళీలు…

అకాడమీ పోస్టులు
ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ (ఐఎంఏ), డెహ్రాడూన్ 100
ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ 45
ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ 32
ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై 241
మొత్తం పోస్టులు 418

అర్హత‌లు…

అకాడమీ విద్యార్హత
ఐఎంఏ, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడమీ డిగ్రీ.
ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ ఇంజినీరింగ్ డిగ్రీ.
ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ ఏదైనా డిగ్రీ . ఇంటర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ చదివి ఉండాలి.(లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ.

వయోపరిమితి…

అకాడమీ వయోపరిమితి
ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ (ఐఎంఏ) అవివాహిత పురుష అభ్య‌ర్థులు 02.01.1997 నుంచి 01.01.2002 మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి.
ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ అవివాహిత పురుష అభ్య‌ర్థులు 02.01.1997 నుంచి 01.01.2002 మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి.
ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ 01.01.2020 నాటికి 20-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.01.1997 నుంచి 01.01.2001 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై – ఎస్ఎస్‌సీ (పురుషులు) అవివాహిత పురుష అభ్య‌ర్థులు 02.01.1996 నుంచి 01.01.2002 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై- ఎస్ఎస్‌సీ (పురుషులు) అవివాహిత మ‌హిళా అభ్య‌ర్థులు 02.01.1996 నుంచి 01.01.2002 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక‌ విధానం: రాతప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్‌-1,2 ప‌రీక్షలు) ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.10.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 19.11.2019
దరఖాస్తుల ఉపసంహరణ 26.11.2019 – 03.12.2019
రాత ప‌రీక్ష తేది 02.02.2020.

ప‌రీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం, తిరుపతి నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.