Hydarbadi టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జైత్రయత్ర

రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఏస్ ప్లేయర్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో తను వరుసగా రెండో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సెమీస్‌లో తలపడనుంది.

అంతకుముందు గురువారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-నాడియా కిచెనోక్ (ఉక్రెయిన్) జంట 6-2, 4-6, 10-4తో వానియా కింగ్-క్రిస్టీనా మిషెల్లీ జంటపై విజయం సాధించింది. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ నెగ్గిన సానియా జంట.. తర్వాతి సెట్ ఓడిపోయింది. ఈ దశలో తన అనుభవన్నంతా రంగరించిన .. సూపర్ టైబ్రేకర్‌లో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సెమీస్‌లో బౌజుకోవా-జిదాన్సెక్ జంటతో సానియా ద్వయం తలపడనుంది.

Read Also :
చివరిసారిగా 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో బరిలోకి దిగిన సానియా.. రెండేళ్ల తర్వాత మళ్లీ బుధవారమే అంతర్జాతీయ టోర్నీల్లోకి అడుగుపెట్టింది. మరో రెండు విజయాలు సాధిస్తే తన కెరీర్‌లో మరో డబుల్స్ టైటిల్ దక్కించుకుంటుంది. గతంలో మహిళల డబుల్స్‌లో ప్రపంచ నం.1గా నిలిచిన సానియా.. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. కుమారునికి జన్మనివ్వడం కోసం సానియా రెండేళ్ల బ్రేక్ తీసుకుంది.

Read Also :

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.