Guntur: పిన్ని ఎంత నీచానికి దిగజారిందంటే..

పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అంటారు. కానీ ఈ పిన్ని మాత్రం కూతురులాంటి మహిళపై నీచానికి పాల్పడింది. సమాజంలో దిగజారుతున్న కుటుంబ బాంధవ్యాలు, వావివరుసలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. చుట్టపు చూపుగా ఇంటికి వచ్చిన మహిళకు మత్తు మందిచ్చి అసభ్యకరంగా ఫోటోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తోంది. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Also Read:

నరసరావుపేటకు చెందిన ఓ మహిళ నెలరోజుల క్రితం బుక్కాపురంలోని తన పిన్ని ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ డాబాపై నిద్రించారు. ఆ మహిళ తిన్న ఆహారంలో మత్తుమందు కలిపిన పిన్ని ఆమెను అసభ్యకర రీతిలో ఫోటోలు తీసింది. వేరొక వ్యక్తితో రొమాన్స్ చేస్తున్న వాటిని మార్ఫింగ్ చేయించింది. మరుసటి రోజు ఆ మహిళ తన ఇంటికి వెళ్లిపోయింది.

Also Read:

కొద్దిరోజుల తర్వాత పిన్ని ఆ మహిళ వాట్సాప్‌పై ఆ ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్ చేసింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించింది. దీంతో బాధితురాలు నాదెండ్ల పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ పిన్నిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువు కదా అని చుట్టపు చూపుగా ఇంటికి వెళ్తే పిన్న తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.