‘హాలోవీన్’ అంటే ఏమిటీ? అంతా దెయ్యాల్లా ఎందుకు తయారవుతారు?

‘హాలోవీన్’గా పిలిచే ఈ ఐర్లాండులో పుట్టింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. పంట కోతల కాలం ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక క్రమేనా ప్రపంచమంతా పాకింది. రోమన్ పాలనకు ముందు బ్రిటన్ స్పెయిన్, గాల్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్లు (సెల్టిక్ లేదా కెల్ట్‌లు) ‘హాలోవిన్’ను నూతన సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకొనేవారని చరిత్రకారుల కథనం.

Also Read:

ఏటా అక్టోబరు 31న.. ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read:

‘హాలోవీన్’ ఎలా పుట్టిందంటే..: ‘ఆల్ హలో ఈవెనింగ్’ నుంచి ఈ ‘హాలోవిన్’ పుట్టింది. దీన్ని ‘ఆల్ సెయింట్స్ డే’ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు యూఎస్‌ఏలో మాత్రమే జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. ఈ రోజు వస్తుంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. ఈ రోజున పిల్లలతో ‘ట్రిక్ ఆర్ ట్రీట్’ ఆటను ఆడతారు. అందుకే, వస్తుందంటే చాలు.. పిల్లల్లో చెప్పలేని ఆనందం నెలకొంటుంది.

జాక్-ఒ-లాంతర్: ‘హలోవీన్’లో అత్యంత ముఖ్యమైనది ‘జాక్-ఒ-లాంతర్’. గుమ్మడికాయలో లాంతర్లను పెట్టి అలంకరిస్తారు. మద్యానికి బానిసైన జాక్ అనే వృద్ధ రైతు.. తనని విసిగిస్తున్న దెయ్యాన్ని చెట్టు మీదకు ఎక్కించి శిలువ వేసి బంధిస్తాడు. ఆ సమయంలో అతడి చేతిలో ముల్లంగి దుంపతో తయారు చేసిన లాంతరు ఉంటుంది. దీంతో, ఆ దెయ్యం.. జీవితాంతం ఆ లాంతరుతోనే తిరిగాలని జాక్‌ను శపించిందని, అప్పటి నుంచి అంతా లాంతర్లను తయారు చేసి గుమ్మాల ముందు ఉంచుతారని చెబుతుంటారు. ప్రస్తుతం హాలోవీన్‌ రోజున గుమ్మడి కాయల లాంతర్లనే వాడుతున్నారు. ఈ రోజున అంతా నలుపు, నారింజ రంగుల వస్త్రాలు ఎక్కువ ధరిస్తారు. మీకు కూడా ఈ పండుగ చేసుకోవాలంటే.. ఇప్పుడే సిద్ధమవ్వండి.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.