హాట్ బ్యూటీతో రకుల్ ప్రీత్ వర్కౌట్స్.. తెగ రాసేసుకుంటున్నారు!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసింది. సౌత్‌లో పెద్ద చిత్ర పరిశ్రమలు అయిన టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ల వైపు చూస్తోంది. ఇటీవల ‘దే దే ప్యార్ దే’ సినిమాలో అజయ్ దేవగణ్‌తో రొమాన్స్ చేసిన రకుల్.. తాజాగా ‘మర్‌జావన్’ చిత్రంలో నటించింది. రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్ర హీరోలుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదిలా ఉంటే, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీష్‌తో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ హాటీస్‌తో చేస్తోంది. తాజాగా బాలీవుడ్ హాట్ యాక్టర్, సింగర్ సోఫీ చౌదరితో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్స్ చేసింది. ఈ వర్కౌట్స్ సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోఫీ చౌదరి తన ఇన్‌గ్రామ్ స్టోరీలో పెట్టుకుంది. వర్కౌట్ సూట్స్‌లో ఈ ఇద్దరు భామలు పిచ్చ హాట్‌గా ఉన్నారు. ముఖ్యంగా రకుల్, సోఫీ వెనక్కి తిరిగి ఒకరిని ఒకరు రాసుకుంటూ చేసే వర్కౌట్ అయితే మరీ హాట్‌గా ఉంది.

కాగా, తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ ఆఖరిగా కనిపించిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఆ తరవాత తెలుగులో ఏ సినిమాను రకుల్ అంగీకరించలేదు. తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’లో ఒక పాత్ర చేస్తోంది. ప్రస్తుతానికి అయితే రకుల్‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. దర్శక, నిర్మాతలు ఎవరూ రకుల్ వైపు చూడట్లేదని టాక్. చూద్దాం మళ్లీ ఏ స్టార్ హీరోతో అయినా ఎంట్రీ ఇస్తుందేమో..!

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.