సైజ్ మ్యాటర్ కాదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు తొలిసారిగా ఇండియన్ బ్రెయిన్ అట్లాస్‌ను రూపొందించారు. పశ్చి, తూర్పు దేశాల ప్రజలతో పోలిస్తే.. సగటు భారతీయుడి మెదడు పరిణామంలో చిన్నగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. మెదడు ఎత్తు, వెడల్పు.. ఇలా అన్ని విధాలుగా చిన్నగా ఉందట. దీని వల్ల అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధ వ్యాధులను ముందుగానే గుర్తించే వీలుందని తెలిపారు. న్యూరాలజీ ఇండియా అనే జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు.

చైనీస్, కొరియన్ల బ్రెయిన్ కంటే పొడవు, వెడల్పు, ఎత్తు, పరిమాణాల్లో భారతీయుల మెదడు చిన్నగా ఉందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు గుర్తించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన .. తనదైన శైలిలో స్పందించారు. సైజ్ ఎంతనేది మ్యాటర్ కాదని ఆయన ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.