సముద్రంలో ‘సాగరకన్య’.. కొడుక్కి పాఠాలు నేర్పుతోంది

బాలీవుడ్ బ్యూటీ వెండితెరకు దూరమైనప్పటికీ తన జీరో సైజ్ ఫిగర్‌తో, యోగా వీడియోలతో, వంటలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. ఓ బిడ్డకు తల్లైన శిల్ప ఇప్పటికీ సెక్సీ బాడీతో ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేస్తున్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న శిల్ప సముద్రంలో తన ఏడేళ్ల కుమారుడు వియాన్‌కు ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్పించారట. తన కుమారుడితో కలిసి సముద్రంలో మునిగి సహజంగా ఎలా ఊపిరి పీల్చుకోవాలో ఆ ట్రిక్స్ అన్నీ నేర్పించిందట.

ఈ విషయాన్ని శిల్ప ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ వీడియో షేర్ చేశారు. 44 ఏళ్ల వయసులో శిల్ప ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈ వయసులోనూ తన కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పుషప్స్ చేయగలరు. తాజాగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు విపరీతమైన స్పందన వస్తోంది. శిల్ప ఎందరో తల్లులకు రోల్‌ మోడల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శిల్ప సినిమాలకు దూరంగా ఉన్నారు. తన కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు. తనకున్న వ్యాపారాలను చూసుకుంటున్నారు. అప్పుడప్పుడూ ముంబయి వాసులకు స్పెషన్ ఈవెంట్స్ సందర్బంగా యోగా పాఠాలు కూడా నేర్పుతుంటారు. రచయిత్రి గానూ శిల్పకు మంచి పేరుంది.

1993లో బాజీగర్ చిత్రంతో బాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టారు శిల్ప. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్‌కు జోడీగా ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత నాగార్జునకు జోడీగా ‘ఆజాద్’ సినిమాలో నటించారు. చివరిసారిగా 2014లో వచ్చిన ‘డిష్కియావ్’ సినిమాలో ఓ పాటలో నటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ఆ తర్వాత టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేశారు. చాలా కాలం తర్వాత ఆమె ‘నికమ్మా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు. సబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.