షాకింగ్.. చిత్తూరులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

ఆడపిల్లకు సురక్షితమైన ప్రదేశమేంటంటే టక్కున అందరూ సొంత ఇల్లే అని చెప్తారు. కానీ, కొన్ని దుర్మార్గాలను చూసినప్పుడు ఆడబిడ్డకు ఇల్లు కూడా రక్షణ కవచం కాదా? అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి దారుణ సంఘటనే జిల్లాలో చోటుచేసుకుంది. ఒళ్లు మదమెక్కిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మానవత్వాన్ని మంటగలుపుతూ ఓ తండ్రి.. బిడ్డపైనే లైంగిక దాడికి ఒడిగట్టాడు.

Also Read:

చిత్తూరు జిల్లా నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దామరకుప్పం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు 13 ఏళ్ల కూతురు ఉంది. ఆ బాలిక బీసీ హాస్టల్‌లో చదువుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కన్న కూతురిపై కన్నేసిన తండ్రి అదనుచూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:

ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అయితే బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్రిష్ణయ్యపై ‘దిశ’ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.