విద్యార్థినులపై వార్డెన్ లైంగిక వేధింపులు.. భరించలేక..

విద్యార్థినులకు రక్షణగా ఉండాల్సిన వార్డెన్ వారిని లైంగికంగా వేధించాడు. కంటి పాపలా చూడాల్సిన వాడే కాటేసే ప్రయత్నం చేశాడు. బాలికలు ధైర్యం చేసి ఇంట్లో వాళ్లకు చెప్పడంతో.. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన జిల్లా యాలాల మండలంలోని రసూల్‌పూర్‌లో వెలుగు చూసింది. స్థానిక ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్‌లో 7, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులను వార్డెన్ దశరథ్ గత వారం రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.

కానీ ధైర్యం చేసిన చిన్నారులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని జరిగిందంతా యాజమాన్యానికి వివరించారు. అనంతరం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్సై విఠల్ రెడ్డి వార్డెన్ దశరథ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పాఠశాల యాజమాన్యం పర్యవేక్షణ లోపం ఉందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.