వామ్మో.. ఇలియానా ఇంత భయంకరంగా ఉందేంటి?

ఎప్పుడూ అందంగా, సెక్సీగా కనిపించే గోవా బ్యూటీ ఒక్కసారిగా భయంకరంగా తయారైంది. ఇదంతా హాలోవీన్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ హాలోవీన్‌ని మన ఇండియాలో జరుపుకోరు కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్నో పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఏటా క్రిస్మస్ పండుగకు నెల రోజుల ముందు హాలోవీన్ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ హాలోవీన్ పిచ్చి ఇలియానాకు కూడా పట్టినట్లుంది. కళ్లనిండా కాటుక పూసుకుని నల్లటి దుస్తుల్లో తయారైంది. అయితే ఈ మేకప్ అంతా ఆమె కథానాయికగా నటించిన ‘పాగల్‌పంతి’ సినిమా కోసం. ఈ సినిమా పోస్టర్‌లో ఇలియానా భయంకరమైన అవతారంలో కనిపించింది. పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేలా ఉంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘పాగల్ పంతి’ సినిమాలో జాన్ అబ్రహం, పుల్కిత్ సమ్రాట్, కృతి కర్బంద ప్రధాన పాత్రల్లో నటించారు. వీరికి సంబంధించిన హాలోవీన్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఇక కృతి కర్బంద పోస్టర్ చూస్తే హడలిపోవడం ఖాయం. ఇంతకీ ఈ హాలోవీన్‌ను ఎందుకు జరుపుకుంటారంటే.. చనిపోయినవారిని గుర్తుచేసుకోవడానికి. మూడు రోజుల పాటు ఈ హాలోవీన్‌ను జరుపుకుంటారు. ఈ మూడు రోజులు వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టుకోరు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ శాంతిస్తుందని క్రైస్తవుల నమ్మకం. మన సినీ ప్రుముఖులు కూడా ఈ హాలోవీన్‌ను ఏటా జరుపుకుంటూ ఉంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హా, అయాన్‌లు కూడా హాలోవీన్ గెటప్‌లు ధరించారు. ఈ ఫొటోలను అర్జు్న్ భార్య స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఇలియానా నటిస్తున్న పాగల్ పంతి సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను బుర్రపెట్టి చూడొద్దని చిత్రబృందం ముందే వార్నింగ్ ఇచ్చింది. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న ఇలియానా కెరీర్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడుతుందో లేదో చూడాలి. నవంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.