వనపర్తిలో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్తకోటలో వావి వరుసలు, విచక్షణ మరిచిన ఓ వృద్ధుడు రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూలు పట్టణానికి చెందిన యాకుబ్‌కు కొన్నాళ్ల క్రితం కొత్తకోటలోని ఎస్సీ కాలనీకి చెందిన మణెమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

Also Read:
మణెమ్మకు ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్నకూతురు పుష్పలతకు రెండేళ్ల వయసున్న పాప ఉంది. మంగళవారం మణెమ్మ, పుష్పలత ఓ పని నిమిత్తం బయటకు వెళ్తూ కాసేపు పాపు చూసుకొమ్మని యాకుబ్‌కు అప్పగించి వెళ్లారు. దీంతో ఆ చిన్నారిపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Also Read:
పాప కేకలతో అప్రమత్తమైన స్థానికులు యాకుబ్‌కు పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నారి జననాంగాల వద్ద రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాకుబ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.