వంశీ రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత హాట్ కామెంట్స్

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కేసుల గురించి బాధపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వంపై పోరాడతామని చంద్రబాబు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వంశీకి తిరిగి లేఖ కూడా రాశారు. అయితే వంశీ రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 3 లేదా 4వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఎపిసోడ్‌పై టీడీపీ సీనియర్ నేత హాట్ కామెంట్స్ చేశారు. కేసుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసినప్పుడే చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రభుత్వంపై పోరాడదామని భరోసానిచ్చారు. పార్టీ మారే ఆలోచన మార్చుకోవాలని కృష్ణా జిల్లా పర్యటనలో కూడా చంద్రబాబు మరోసారి వంశీని కోరారన్నారు.

Also Read:

ఆ సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని, అదో టుమ్రీ కేసు.. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పానని రామయ్య పేర్కొన్నారు. ఆయన కేసులో క్రిమినల్ చర్యలకు అవకాశం లేదన్నారు. హ్యాండ్ రైటింగ్ నిపుణుల నివేదిక వచ్చిన తరువాతే ఆ దిశగా చర్యలు ఉంటాయని.. అప్పటి వరకు పాస్‌పోర్టు సీజ్ వంటి వాటికి అవకాశం లేదని చెప్పామన్నారు. కేసుల గురించి తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారని రామయ్య తెలిపారు.

లక్షల మంది సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవొద్దని రామయ్య కోరారు. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ అండగా లేదన్న వాదనలను వర్ల కొట్టిపారేశారు. వంశీపై వ్యక్తిగతంగా కూడా తనకు సదభిప్రాయం ఉందని.. ఆయన పార్టీ నుంచి వెళ్లొద్దని విజ్ఞ‌ప్తి చేశారు. ఆయనపై పెట్టిన కేసులపై వీరోచితంగా పోరాడుదామని రామయ్య అన్నారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.