రాహుల్ ఫ్యాన్స్ గొర్రెలైతే.. శ్రీముఖి ఫ్యాన్స్**వాళ్లా?: సింగర్ నోయల్ ఎటాక్

రాహుల్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేసేందుకు అతని క్లోజ్ ఫ్రెండ్ పాపులర్ ర్యాప్ సింగర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి తాబేలు కుందేలు కథ చెప్పి మరీ రాహుల్‌కి ధైర్యం చెప్పి వచ్చిన నోయల్‌.. రాహుల్ సపోర్టర్స్‌కి నాయకత్వం వహిస్తూ విరివిగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇక రాహుల్‌పై వస్తున్న వ్యతిరేక ప్రచారంపైన, ఫ్యాన్స్ రాహుల్‌పై చేస్తున్న ట్రోలింగ్స్‌పై ఘాటుగా స్పందించారు నోయల్. ఈ సందర్భంగా నోయల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాహుల్ పాత వీడియోలను ఇప్పుడెందుకు బయటపెడుతున్నారు?
‘రాహుల్ ఫైనల్‌కి వెళ్లిన తరువాత సడెన్‌గా అతని పాత వీడియోలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. వీడు ఇలా చేశాడు.. అలా చేశాడు అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఇంకానయం చిన్నప్పుడు డైపర్‌లో చుస్సూ పోశాడని పెట్టలేదు. అతను హౌస్‌లో ఎలా ఉన్నాడు? దాని మీద ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది దానిపై కదా స్పందించాలి.

Read Also:

ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండి ఇప్పుడే ఆ వీడియోలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎవరు బయటపెడుతున్నారన్నది తెలుసుకోండి. ఎందుకు బయటపెట్టిస్తున్నారు? ఒక గేమ్ కోసం మరీ ఇంత చేయాలా? కామెడీ కాకపోతే అనిపిస్తుంది. వాళ్లు అంత ఎక్కువ చేస్తుంటే మనం ఎందుకు సైలెంట్‌గా ఊరుకోవాలనే నేను కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నా.

నేను గొర్రెల బ్యాచ్ లీడర్‌నే
కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. రాహుల్‌ని సపోర్ట్ చేసేవాళ్లు గొర్రెలని.. నేను గొర్రెల బ్యాచ్ లీడర్ అని అంటున్నారు. వాళ్లకు తెలియనిది ఏంటంటే.. గొర్రెలకు ఒక పాజిటివ్ నెస్ ఉంది. అవి ఎక్కడికి వెళ్లినా ఒక మందలాగే వెళ్తాయి. ఎవడిపడితే వాడి వెనుక పోవు. ఎవరైతే గొర్రెల కాపరో అతని వెనకాలే వెళ్తాయి.

మేం గొర్రెలమైతే వాళ్లు నక్కలు, కుక్కలు
వాళ్లలా నక్కలు కాదు మేం. కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు ఇక్కడ ఉండము మేం. అయినా గొర్రెలతో చాలా లాభాలు ఉన్నాయి. నక్కలు, కుక్కలతో ఏం లాభం ఉందో చెప్పండి. ట్రోల్ చేసేముందు ఆలోచించండి. మీకు పిచ్చ కాకపోతే పర్సనల్ విషయాలు మీకెందుకు. మీకు నిజంగా శ్రీముఖికి సపోర్ట్ చేయాలనిపిస్తే చేసుకోండి. అనవసరమైన నెగిటివిటీ ఎందుకు?

శ్రీముఖి బోలెడు సంపాదించింది.. ఈ రూ. 50 లక్షలు అవసరమా?
నేను రాహుల్‌కి సపోర్ట్ చేస్తున్నానంటే వాడి వ్యక్తిత్వం నాకు తెలుసు. చాలా పాజిటివ్‌గా ఉంటాడు. వాడు కెరియర్‌లో చాలా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. బిగ్ బాస్ చిచ్చాకి మంచి ప్లాట్ ఫాంలా దొరికింది. అతనికి బిగ్ బాస్ విన్నర్ అవ్వడం.. రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ అందుకోవడం అతనికి అవసరం. శ్రీముఖి ఇప్పటికే చాలా నేమ్ అండ్ ఫేమ్‌తో పాటు డబ్బు కూడా సంపాదించింది. ఆమెకు ఈ రూ. 50 లక్షలు పెద్ద లెక్క కాదు. ప్లీజ్ సపోర్ట్ రాహుల్ చిచ్చా’ అంటూ శ్రీముఖి ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు సింగర్ నోయల్.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.