రాహుల్‌ని చూసి గర్వపడ్డ బిగ్ బాస్.. అందర్నీ ఏడిపించాడు!

‘సినిమా చూపిస్తా మావా.. నీకు సినిమా చూపిస్త మావా’ అనే మంచి జోష్‌ ఉన్న పాటతో మొదలైంది. శ్రీముఖి, బాబా భాస్కర్‌లు ఎప్పటిలాగే స్టెప్పులతో దుమ్మురేపారు. అనంతరం ఫైనల్‌కి చేరిన ఫైనల్ కంటెస్టెంట్స్‌ ఐదుగురి బ్యూటిఫుల్ జర్నీని విజువల్‌గా చూపించారు బిగ్ బాస్. హౌస్‌లోకి ఎంటరైంది మొదలు.. నేటి వరకూ వాళ్ల వాళ్ల తీపి చేదుల జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఒక్కో కంటెస్టెంట్‌ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి హౌస్‌లో వాళ్ల జర్నీని చూపించే ముందు బిగ్ బాస్.. వాళ్లతో మాట్లాడారు. హౌస్‌లో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది. ప్రేక్షకులు వాళ్ల గురించి ఏమనుకున్నారు? ఇంటి సభ్యులతో వాళ్లు ఎలా ఉన్నారు తదితర విషయాలను కూలంకషంగా తెలియజేశారు.

వరుణ్ సందేశ్ మిస్టర్ పర్ఫెక్ట్..
ముందుగా వరుణ్ సందేశ్‌ని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్ అతని గురించి ఇలా మాట్లాడారు. ‘మిమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. మీరు హౌస్‌లో చాలా బాధ్యతగా వ్యవహరించారు. ఇంటి సభ్యుడి హోదాలో మెప్పించారు. మీరు అందర్నీ స్నేహితులుగా చూసి.. ఆట సమయంలో బలమైన పోటీదారుడిగా నిలిచారు. మీరు మీ భార్యతో రావడంతో పాటు ఆమెనూ పలు సందర్భాల్లో పోటీదారుగానే చూశారు. అందరిలాగే ఆమెనూ చూశారని బిగ్ బాస్ నమ్ముతున్నాడు. ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో సాగిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అంటూ బిగ్ బాస్ హౌస్‌లో వరుణ్ సందేశ్ పూర్తి ప్రయాణాన్నిచూపించారు బిగ్ బాస్. వితికాతో బిగ్ బాస్ హౌస్‌లో వరుణ్ గడిపిన ఆనంద క్షణాలను చూపించడంతో భావోద్వేగానానికి గురయ్యాడు వరుణ్ సందేశ్.

రాహుల్‌ తప్పుల్ని ఎత్తుచూపిస్తూ.. ప్రశంసలు
అనంతరం రాహుల్‌ని పిలిచి.. తన లైఫ్ జర్నీని చూపించారు. ఈ సందర్భంగా రాహుల్‌తో బిగ్ బాస్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్‌లో మీ ప్రయాణంఎటువంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా సాగింది. మీ చుట్టూ ఎప్పుడూ స్నేహితులు ఉండేవారు. అయితే టాస్క్‌లలో మొదట్లో మీరు ఉత్సాహం చూపించేవారు కాదని కొంతమంది భావించారు. అది మీకు ఇంటి సభ్యుల నుండి మీ స్నేహితుల నుండి వ్యతిరేకతను తీసుకు వచ్చింది. ఆ కారణంగానే మీరు పలుసార్లు నామినేషన్స్‌లోకి వెళ్లారు.

మిగతా ఇంటి సభ్యులు తమ గేమ్ తాము ఆడుతూ.. మీతో స్నేహంగా ఉండేవారు. కాని మీరు మీ గేమ్‌ని పట్టించుకోలేదని అనిపించింది. బహుషా మీ మనసుకి వాళ్లలాగ గేమ్ ఆడటం తెలియదేమో. ఇలా అందరూ ముందుకు వెళ్తుంటే మీరు మాత్రం ఆటలో వెనుకబడ్డారు. ఇది మీరు ఎంచుకున్న నిర్ణయం. మీరు మీ స్నేహితులు కోసం వాళ్ల కష్ట సుఖాల్లో ఉన్నారు. వీటన్నింటిలో ఊరట ఇచ్చిన అంశం మీ స్నేహం. మీకు దగ్గరైన స్నేహితులు ఇంటిని వదిలి వెళ్లినప్పుడు మరింత బాధ పడ్డారు. కాని మిమ్మల్ని చూస్తున్న ప్రేక్షకులకు మీరేంటో తెలుసు. మీరు ఏం చేయగలరో తెలుసు అందుకే మీరు ఎన్నిసార్లునామినేషన్‌లో ఉన్నా.. మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. మీరు మీ ప్రదర్శనతో ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు. వెనుతిరిగి చూసుకోలేదు. మీ ప్రదర్శనతో ఫినాలేకి చేరిన మొదటి కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. బిగ్ బాస్ మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నారు. ఇదే స్పూర్తిని ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించాలని కోరుతూ బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ మజీలీలను చూపించారు.

ఈ వీడియో చూసిన తరువాత ఎమోషన్ అయ్యారు రాహుల్. ‘ఈ బిగ్ బాస్ హౌస్ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. నాకు మంచి లైఫ్ దొరుకుతుందని ఆశిస్తున్నా.. నాకు చాలా ఆనందంగా ఉంది బిగ్ బాస్’ థాంక్స్ చెప్పాడు రాహుల్.

అనంతరం శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్‌లకు సైతం బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ల బ్యూటిఫుల్ జర్నీని చూపించి ఏడిపించేశారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.