రామకృష్ణ మఠంలో ‘మహిళల కోసం యోగా’తరగతులు

అసలే ఉరుకులు పరుగుల జీవితం.. ఉద్యోగాలు, ఇంట్లో బాధ్యతలకు తోడు పిల్లలతో బిజీ, బిజీ. ఇలా నేటి తరం మహిళలకు మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే యోగా ఓ గొప్ప మార్గం. అందుకే మహిళల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని యోగా తరగతులు అందిస్తోంది. రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ‘మహిళల కోసం యోగా’తరగతులు ప్రారంభించబోతోంది. ఆసక్తి ఉన్న మహిళలు ఈ కోర్సులో చేరవచ్చని రామకృష్ణ మఠం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ యోగా తరగతులు నవంబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు నాలుగు వారాల పాటు (సోమవారం నుంచి శుక్రవారం ) తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఈ కోర్సు నిమిత్తం రూ.1000ల ఫీజును వసూలు చేస్తున్నారు.

కోర్సు పేరు: మహిళలకు యోగాసనాలు

బోధనా అంశాలు:
* ఇంట్రడక్షన్ & బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యోగా
* ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ డైలీ లైఫ్
* సూర్య నమస్కరాస్ ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్
* ఆసనాస్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ & బాడీ
* ప్రాణాయామా మెథడ్స్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్

అర్హత వయసు: 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు ప్రవేశాలు పొందవచ్చు.

ఫీజు: రూ. 1000

ప్రవేశాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040 – 27627961, 9177232696.

తరగతులు నిర్వహించే సమయం– సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: rkmath.org

మెయిల్– .vihe@rkmm.org

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.