రాజీనామాకు రెడీ.. ఏపీ మంత్రి అవంతి సవాల్

ఏపీలో ఇసుక వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది.. ఈ వ్యహారం సవాళ్ల వరకు దారి తీసింది. ఆరోపణలపై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇసుక అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఇసుక అక్రమాల వెనుక వైఎస్సార్‌సీపీ నేతల హస్తం ఉందని నిరూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమన్నారు. గురువారం విశాఖలో మాట్లాడిన మంత్రి.. టీడీపీ నేతలతో పాటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

Read Also:

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పారని.. మళ్లీ ఎన్నికల్లో ఆ నాయకులకే టికెట్లు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు ఇసుక కొరత పేరుతో అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని.. ఇప్పటికైనా తమ పద్దతి మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.

ఇక జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌‌పైనా మండిపడ్డారు అవంతి. పవన్‌కు చంద్రబాబుపై అభిమానం ఉంటే పార్టీని టీడీపీలో విలీనం చేయొచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని.. ఓడిన తర్వాత పవన్‌ కళ్యాణ్ గాజువాకలో కనిపించలేదని సెటైర్లు పేల్చారు మంత్రి.

ఇటు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేతలు. ఇసుక పేరుతో బాబు, పవన్‌లు కొత్త నాటకాలు మొదలు పెట్టారని.. ఆ ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారంటూ సెటైర్లు పేల్చారు. టీడీపీ, జనసేనతో తమ పార్టీ వేదిక పంచుకోదని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తుకు టీడీపీకి శాశ్వతంగా ద్వారాలు మూసేశామన్నారు. చంద్రబాబు ఉన్న ఏ వేదికను తాము పంచుకోమన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.