మద్యం తాగేందుకు ఫ్రెండ్ ఇంటికొచ్చి అతడి భార్యనే రేప్ చేశారు

సమాజంలో నానాటికీ మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. వావి వరుసలు మరిచి తల్లి, చెల్లీపైనే కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కామాంధులు మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చి అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకు ఆ దుర్మార్గులు బాధితురాలిని తీవ్ర చిత్రహింసలు పెట్టారు.

Also Read:

మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా మురావాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామానికి చెందిన రామ్‌సింగ్‌ భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తన ఇంట్లోనే మద్యం తాగాడు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత ఆ ఇద్దరి కన్ను రామ్‌సింగ్ భార్యపై పడింది. వారిలో ఒకడు ఆమెను ఇంటి వెనక్కి లాక్కెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చిత్రహింసలు పెట్టాడు. నిస్సహాయ స్థితిలో పడివున్న బాధితురాలిపై ఆ కామాంధులిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Also Read:

బాధితురాలు కేకలు వేసిన మద్యం మత్తులో ఉన్న రామ్‌సింగ్‌కు వినపించలేదు. కాసేపటి తర్వాత మత్తు నుంచి తేరుకున్న రామ్‌సింగ్ భార్యపై తన స్నేహితులు జరిపిన అఘాయిత్యం గురించి తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. వారిపై దాడికి యత్నించగా ఆ దుర్మార్గులిద్దరూ బండరాయితో రామ్‌సింగ్ తలపై విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే చనిపోవడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో మురావాస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.