భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన

భారత్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ బోర్డు తాజాగా జట్లని ప్రకటించింది. వాస్తవానికి టీ20 సిరీస్‌ కోసం ఈ నెల 17న జట్టుని బంగ్లాదేశ్ ప్రకటించింది. కానీ.. ఆ జట్టు నుంచి అనూహ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకోగా.. సైపుద్దీన్ గాయపడ్డాడు. ఇక టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. బుకీ తనని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ వద్ద షకీబ్ దాచడంతో ఈ మేరుకు నిషేధం వేటు వేసింది. దీంతో.. మరోసారి ఫ్రెష్‌గా జట్టుని బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ టీ20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్

ఢిల్లీ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత గురువారం రెండో టీ20.. మళ్లీ ఆదివారం (నవంబరు 10) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక నవంబరు 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్.. 22 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు.

బంగ్లాదేశ్ టెస్టు జట్టు: మిమునల్ హక్ (కెప్టెన్), షదామన్ ఇస్లామ్, ఇమ్రూల్ కైస్, సైప్ హసన్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఎండీ మిథున్, హుస్సేన్ సైకత్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అల్ అమిన్ హుస్సేన్, అబు జావెద్, ఎబడాత్ హుస్సేన్

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.