'బాలయ్య కోసమే రాజకీయాల్లోకి.. నాపై తప్పుడు ప్రచారం'

నందమూరి బాలకృష్ణ కోసం రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు మాజీ ఎమ్మెల్యే . బాలయ్య, తాను బాల్యం నుంచి ప్రాణ స్నేహితులమని.. ఆయన వెంటే తన పయనం ఉంటుందన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాను టీడీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. కొద్దిరోజులుగా బాబూరావు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని చెప్పారు.

Read Also:

తాను ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా ఉన్నానని.. కనిగిరి నుంచి వెళ్లి దర్శిలో పోటీ చేయాలని పార్టీ ఆదేశించిందని.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు బాబూరావు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కదిరి ఆరోపించారు. ఇసుక కొరతతో లక్షలాదిమంది కార్మికులు పనులు లేక, అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో ఉపాధి హమీ నిధుల మ్యాచింగ్‌తో నిర్వహించిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. జగన్ సర్కార్ కక్షసాధిస్తోందని.. కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినా బిల్లులు చెల్లించడం లేదని.. ఆ నిధుల్ని ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కదిరి బాబూరావు సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. బాబూరావు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కానీ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎంట్రీతో.. ఆయన్ను దర్శికి పంపించి.. అక్కడి నుంచి పోటీ చేయించారు. దర్శి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఎంపీగా పోటీ చేశారు. కదిరి బాబూరావు పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్పందించారు.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.