‘బాబా భాస్కర్‌కి నో సపోర్ట్’.. జాఫర్ ఎమోషనల్ పోస్ట్

‘తెలుగు బిగ్ బాస్ షోలో తమిళ కొరియోగ్రాఫర్ ఏంటి? మన తెలుగు వాళ్లకు టాలెంట్ లేదా?’ అని బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభంలో బాబా భాస్కర్‌ను ఉద్దేశించి పెద్ద ఎత్తున నెటిగివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే రెండు మూడు వారాలు గడిచే సరికే ఆయన్ని ద్వేషించిన వాళ్లే ప్రేమించడం మొదలుపెట్టారు. ఒక వారం కాదు రెండు వారాలు కాదు ఏకంగా 14 వారాలు పాటు బాబా భాస్కర్‌లో గెలిపిస్తూ.. బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ చేశారు. తెలుగు ఆడియన్స్ ప్రేమించడం మొదలుపెడితే భాష, ప్రాంతం లెక్కే ఉండదని విషయంలో రుజువుచేశారు.

Read Also:

బాబా భాస్కర్ కాదు.. ఆయన పెద్ద మాస్కర్ అంటూ హోస్ట్ నాగార్జున లాంటి పెద్ద వ్యక్తులతో పాటు ఇంటి సభ్యులు ఆయన్ని బాధపెట్టినా ప్రేక్షకులు మాత్రం ఆయన ఆట తీరుకు ఫిదా అయ్యారు. టైటిల్ గెలుస్తారా? ఓడిపోతారా? అన్న విషయాన్ని పక్కనపెడితే బాబా భాస్కర్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌లో తన తోటి కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే బాబా భాస్కర్‌ను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఆయనకి అత్యంత సన్నిహితుడు, బాబా క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ హౌస్ మేట్ . ‘బిగ్ బాస్ హౌస్‌లో వున్నవాళ్ళందరూ నాతో చాలా ప్రేమగా, అభిమానంగా, గౌరవంగా ఉండేవారు .అందరూ మంచోళ్ళే. భయంకరమైన కుట్రలు, కుతంత్రాలు తెలియవు. ఎత్తులు పై ఎత్తులు వేస్తునట్టుగా కూడా నేను గమనించలేదు. అయితే తెలివిగా ఆడుతున్నారు. లోపలున్నవారికి ఎవరో ఒకరి సపోర్ట్ అయితే వుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ లేదా ఫ్రెండ్స్ సపోర్ట్. కొంత మందికి సోషల్ మీడియా మేనేజర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్క బాబా భాస్కర్‌కు తప్ప.

ఆయన కుటుంబ సభ్యులకు అంత అవగాహన లేదు. సోషల్ మీడియా అంటే తెలియదు. చాలా ఇన్నోసెన్ట్స్. ఇక బాబా విషయానికొస్తే.. ఆట కోసమో, లేదా టైటిల్ కోసమో మాస్కులు వేసుకునే తత్వం బాబాది కాదు. రెండువారాల పాటు అతన్ని చాలా దగ్గరిగా చూశాను. ఇదీ.. బాబాపై నా అవగాహన’ అంటూ పోస్ట్ పెట్టారు జాఫర్. మొత్తంగా ఎవరు సాయం చేసిన చేయకపోయినా.. బాబా భాస్కర్‌కు తన బిగ్ బాస్ మిత్రుడు జాఫర్ నుండి మంచి సపోర్ట్ ఈ పోస్ట్ రూపంలో లభించిందనే చెప్పాలి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.