బన్నీకి విలన్‌గా మక్కల్ సెల్వన్.. ఓకే చెప్పిన తమిళ స్టార్ నటుడు

కోలీవుడ్‌లో సూపర్ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తున్నారు విజయ్. తమిళ అనువాద చిత్రం ‘పిజ్జా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ 41 ఏళ్ల నటుడు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో తమిళ యోధుడు రాజా పాండిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం, పంజా వైష్ణవ్ తేజ్ ఆరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి టాలీవుడ్ భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వస్తు్న్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారని టాక్. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు.

Also Read:

అయితే, ఇప్పటికే విజయ్ సేతుపతికి సుకుమార్ స్టోరీ లైన్‌ను చెప్పారని.. పాత్రను కూడా వివరించారని అంటున్నారు. సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ విజయ్ సేతుపతికి బాగా నచ్చేసిందని, దీంతో విలన్‌గా నటించడానికి ఆయన అంగీకరించారని ఓ ప్రముఖ తమిళ దినపత్రికకు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను విజయ్ సేతుపతికి సుకుమార్ నెరేట్ చేయనున్నారని తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. శేషాచలం అడవులు, తిరుమల పర్వత ప్రాంతాల్లో కథ నడుస్తుందట.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.