'పేటీఎం చిల్లర బ్యాచ్ ఇంతకంటే ఏం చేస్తాయ్'

వైఎస్సార్‌సీపీపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి . తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై విరుచుకుపడ్డారు. తన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనపై మార్ఫింగ్ ఫోటోలతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని.. పేటీఎం చిల్లర కోసం ఎంతకైనా దిగజారిపోతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.


లోకేష్ తన ట్వీట్‌లో ‘పేటిఎం చిల్లర కోసం ఎంతకైనా దిగజారి చిల్లర పోస్టులు పెట్టే వాళ్ళకి ఇంతకన్నా సంస్కారవంతమైన, ప్రయోజనకరమైన ఆలోచనలు వస్తాయని నేననుకోను. అయినా అది వాళ్ళ తప్పుకాదు. వాళ్ళ నాయకుని చరిత్ర అలాంటిది’అంటూ తీవ్ర స్థాయిలో నారా లోకేష్ ధ్వజమెత్తారు.

‘వాళ్ళ నాయకుడికి కాసుల కక్కుర్తి ఉండబట్టే వేల కోట్ల అవినీతికి పాల్పడి జైలు కూడు తినొచ్చారు. ఆ రోజుల్లో భోజనం ఏర్పాట్ల గురించి బహుశా ఆయన అలా గొడవ పడ్డారేమో!’అంటూ తనపై మార్ఫింగ్ చేసిన ఫోటోను కూడా లోకేష్ ట్వీట్‌లతో పాటూ షేర్ చేశారు. లోకేష్‌పై చేసిన ఈ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

Also Read:

ఇంతకీ ఆ మార్ఫింగ్ ఫోటోలో ఏముందంటే..
లోకేష్ ఏలూరు సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. జైలులో ఆయన్ను కలిసి కేసలు విషయంపై చర్చించారు.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అయితే లోకేష్ పర్యటనను ప్రస్తావిస్తూ.. చింతమనేనిని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్.. భోజన ఏర్పాట్లు చెయ్యలేదని జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది వైఎస్సార్‌సీపీ నేతల పనిగా లోకేష్ ఆరోపణలు చేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.