పెళ్లికొడుకు లేకుండా పెళ్లేంటి సార్.. సీఎం జగన్‌పై సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారికంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

నవంబర్ ఒకటో తేదీ సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేడుకలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోస్టర్లను విడుదల చేసింది. పోస్టర్లపై మహాత్మ గాంధీ చిత్రంతో పాటు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫొటోలు మాత్రమే ప్రచురించారు.

Also Read:

ఇప్పుడదే విషయమై సోషట్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఫొటో ప్రచురించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత ఆ విషయంపై స్పందించారు. పోస్టర్లపై అమరజీవి ఫొటో లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రభుత్వానికి ఆయన గురించి తెలుసో లేదో అంటూ ఎద్దేవా చేశారు.

వెనకటికి ఒకడు.. పెళ్లికొడుకు లేకుండా పెళ్లికి సిద్ధమయ్యాడట! ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల నిర్వహణ తీరు అలా ఉందంటూ వర్ల రామయ్య సెటైర్లు వేశారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో అసలు రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన అమరజీవి పొట్టి శ్రీరాములు ఫొటో ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు. అసలు ఆయన గురించి మీ ప్రభుత్వానికి తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఆత్మత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని తెలుసుకోవాలంటూ జగన్‌కి హితవు పలికారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.