'పవన్ కళ్యాణ్ మార్చ్‌కు వెళ్లం.. గవర్నర్ దగ్గరకు వెళ్లిందే మేము'

ఏపీలో ఇసుక వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. టీడీపీ ఈ వ్యవహారంపై ఇప్పటికే జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తే.. అధినేత పవన్ ఏకంగా ఈ నెల మూడున విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పనిలో పనిగా ప్రతిపక్షాలన్నిటిని ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరికి ఆయనే స్వయంగా ఫోన్లు చేసి.. లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలపాలని కోరారు. అన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందించినట్లు జనసేన చెబుతోంది.

ఆహ్వానంపై నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ఆ సభకు తాము వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మొదటి నుంచి ఇసుక సమస్యపై పోరాటం చేస్తుంది బీజేపీ మాత్రమే అన్నారు. విష్ణు తన ట్వీట్‌లో ‘ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గారు పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇసుక సమస్య పై మొదటి నుండి పోరాడుతుంది బీజేపీ. ముఖ్యమంత్రి కి లేఖ రాసింది మొదట బీజేపీనే. ఇసుక సమస్య పై గవర్నర్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ’అన్నారు.

‘భవన నిర్మాణ కార్మికుల కొరకు భిక్షాటన కార్యక్రమం చేసింది బీజేపీ. సమస్య కి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు సంఘీభావం కాదు. బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4 వ విజయవాడ లో కన్నా గారి అధ్యక్షుతన పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడతాము’అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ నేత విష్ణువర్థన్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది.. దీనిపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.