నిత్యా మీనన్‌కు పెళ్లయిపోయిందా.. అందుకే ‘శ్రీమతి’ అని రాశారా?

దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగులోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్‌ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో కనిపించారు.

కాగా, ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్నారు. ‘ది ఐరన్ లేడీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయలిలత పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. అయితే.. ఈ సినిమాను, జయలలితను ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ తమిళ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ‘శ్రీమతి నిత్యా మీనన్’ అని పేర్కొంది. దీంతో రచ్చ మొదలైంది. సాధారణంగా పెళ్లైన మహిళలనే శ్రీమతి అంటారు. కానివాళ్లను కుమారి అంటారు. కాబట్టి, ఆ దినపత్రిక శ్రీమతి అని పేర్కొంది కనుక నిత్యా మీనన్‌కు పెళ్లయిపోయిందని ప్రచారం చేస్తున్నారు.

Also Read:

వాస్తవానికి దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్లు అయిన రాధికా ఆప్టే, శ్రియ, ఇలియానా రహస్య వివాహాలు చేసుకున్నారు. తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను పెళ్లిచేసేసుకున్న తరవాత కొన్నాళ్లకు ప్రకటించారు. ఇలియానా అయితే పెళ్లిచేసుకుని విడాకులు కూడా తీసేసుకుంది. కాబట్టి, నిత్యా మీనన్ విషయంలో అలా ఎందుకు జరగకూడదు అని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు ఇప్పటికే పెళ్లికాకపోతే శ్రీమతి అని ఎందుకు రాస్తారు అని వైరల్ చేస్తున్నారు.

టెలివిజన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన ఆలివర్ మాక్ కల్హౌన్‌తో దిగిన ఫొటోలను ఇప్పటికే నిత్యా మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆనెనెస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆలివర్ తనకు మంచి మిత్రుడని చెప్పకనే చెప్పారు. దీంతో నిత్య పెళ్లిపై ఇప్పుడు అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. చూద్దాం ఈ పెళ్లి రూమర్‌గా మిగిలిపోతుందో.. లేకపోతే రాధికా ఆప్టే, శ్రియ మాదిరిగా నిత్యా మీనన్ ఏమైనా షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేస్తారో..!

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.