నా మాజీ భర్తే పిల్లల జీవితాల్ని నాశనం చేశాడు: స్టార్ నటి

ప్రముఖ హాలీవుడ్ నటులు , బ్రాడ్ పిట్ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరినీ ఫ్యాన్స్ బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. ఈ జంటకు ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే ప్రముఖ వ్యాక్స్ మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్స్‌లో వీరిద్దరి మైనపు విగ్రహాలను ఒకేసారి డిజైన్ చేసి పక్క పక్కనే పెట్టారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇందుకు కారణం బ్రాడ్‌పిట్ తాగి పిల్లల్ని కొట్టడమే. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు వీరికే పుట్టగా మిగిలిన వారిని దత్తత తీసుకున్నారు.

కానీ తాగుడు అలవాటు ఉండటం వల్ల బ్రాడ్‌పిట్ మైకంలో పిల్లలపై చెయ్యి చేసుకునేవాడట. దాంతో తన పిల్లల జీవితం ఏమైపోతుందోనని భయపడిన ఏంజిలినా బ్రాడ్‌పిట్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. పిల్లల కస్టడీ కూడా తనకే ఇవ్వాలని కోరింది. బ్రాడ్‌పిట్ తన పిల్లల జీవితాలను తలకిందులు చేసేశాడని తాజాగా ఏంజిలినా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా పిల్లల జీవితాలనే కాదు నా జీవితాన్ని కూడా బ్రాడ్ తలకిందులుగా మార్చేశారు. అందుకే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నా. కానీ పిల్లల్ని చూసుకునే హక్కు బ్రాడ్‌కి కూడా ఉంది కాబట్టి అతను ఉండే ప్రదేశంలోనే వేరే ఇల్లు తీసుకుని ఉండాల్సి వస్తోంది. అసలు నేను బ్రాడ్‌పిట్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ అతనే పెళ్లికి బలవంతంగా ఒప్పించాడు. అందుకే ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలేదు’ అని వెల్లడించారు.

కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఏంజిలినా, బ్రాడ్‌పిట్ 2012లో పెళ్లి చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు పుట్టాక ఏంజిలినాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. దాంతోో ఇద్దరు పిల్లల్ని జన్మనిచ్చాక మరో నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏంజిలినాతో విడిపోయాక బ్రాడ్‌పిట్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఇందుకు ఏంజిలినా ఒప్పుకోలేదు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.