నవంబర్ 5న లాంచ్ లతో అదరగొట్టనున్న Xiaomi.. ఏమేం వస్తున్నాయంటే!

ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజం అయిన షావోమి నవంబర్ 5న లాంచ్ లతో అదరగొట్టనుంది. మొదట స్మార్ట్ ఫోన్ లపై మాత్రమే దృష్టి పెట్టిన షావోమి క్రమంగా స్మార్ట్ ఫోన్ యాక్సెసరీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో కూడా కాలు పెట్టింది. మెల్లగా ఆయా విభాగాల్లో కూడా ముందుకు దూసుకుపోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 5న అనేక ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. వీటిలో ఎంఐ సీసీ9 ప్రో మొబైల్, షావోమి వాచ్, ఎంఐ టీవీ సిరీస్ 5 కూడా ఉన్నాయి. ముందుగా నవంబర్ 5న చైనా మార్కెట్లో లాంచ్ అవ్వనున్న ఈ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో తర్వాత లాంచ్ అవుతాయి. నవంబర్ 5కు మరికొన్ని రోజుల సమయం ఉండటంతో ఆ లోపు మరిన్ని ఉత్పత్తులు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.

Also Read:

ముందుగా ఎంఐ టీవీ గురించి మాట్లాడినట్లయితే.. ఈ మధ్యే దీనికి సంబంధించిన టీజర్ ను ఎంఐ విడుదల చేసింది. ఈ ఎంఐ టీవీ 5 సిరీస్ లో 4 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో అమోలోజిక్ టీ972 చిప్ సెట్ ను అందించారు. దీనికి ముందు చిప్ సెట్ కంటే 63 శాతం మెరుగైన ప్రదర్శనను ఇది కనబరుస్తుందని కంపెనీ వారు ఈ సందర్భంగా తెలియజేశారు. 8K వీడియో ప్లేబ్యాక్ ను కూడా ఈ చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. మరో టీజర్ లో MEMC అనే కొత్త టెక్నాలజీని కూడా ఈ టీవీ ద్వారా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. MEMC అంటే మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కాంపన్సేషన్. ఈ టీవీ హెచ్ డీఆర్ 10+ ఫీచర్ ను కూడా సపోర్ట్ చేయనుంది.

Also Read:

ఇక ఎంఐ వాచ్ విషయానికి వస్తే.. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు బయటకు వచ్చాయి. షావోమి నుంచి వస్తున్న మొదటి స్మార్ట్ వాచ్ ఇదే కావడంతో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. ఇందులో ఉన్న ఫీచర్లేంటి? ఎలా పని చేస్తుంది? అనే అంశాలపై రకరకాల టీజర్లను విడుదల చేశారు. ఈ టీజర్లలో ఒకదాని ద్వారా ఎంఐ వాచ్ లో ఎంఐయూఐ ఎలా ఉండనుందో చూపించారు. ఎంఐ వాచ్ లో కూడా ఇదే ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించనున్నారు.

ఎంఐ సంస్థ ఈ వాచ్ కోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించారు. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఈ యాప్ ను నేరుగా వాచ్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బయటకు వచ్చిన టీజర్ల ప్రకారం ఇందులో ఈ-సిమ్ కనెక్టివిటీ, వైఫై సపోర్ట్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

Also Read:

ఇక వీటితో పాటు ఎంఐ సీసీ9 ప్రో అనే మొబైల్ ను కూడా షావోమి లాంచ్ చేయనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 108 మెగా పిక్సెల్ తో లాంచ్ అవుతున్న మొబైల్ ఇదేనని షావోమి ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ఇందులో వెనకవైపు ఐదు కెమెరాలు అందించనున్నారు. చైనాలో ఎంఐ సీసీ9 ప్రో పేరిట విడుదలవుతున్న ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో ఎంఐ నోట్ 10 పేరుతో విడుదల కానుంది. దీన్ని నవంబర్ 14న ప్రపంచ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు షావోమి ఇప్పటికే ప్రకటించింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.