ధనవంతులు కావాలా? అయితే మీకోసం 3 ఆప్షన్లు..!

డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. చేతిలోని డబ్బుతో కూడా డబ్బు సంపాదించొచ్చు. దీనికి ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. అయితే మూడు ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఝకాలంలో అదిరిపోయే రాబడి పొందొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌కు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరుగుతోంది. సిప్ రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారు పెరుగుతూ వస్తున్నారు. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడి పొందొచ్చు. అయితే ఇక్కడ ఓ సమస్య. మార్కెట్‌లో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మరి వేటిలో ఇన్వెస్ట్ చేయాలి? అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. క్వాంటమ్ క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ పూరి పలు ఫండ్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. అవి ఏంటివో చూద్దాం..

Also Read:

1. HDFC Top 100 Fund
2. ABSL Equity Fund
3. SBI Small Cap Fund
4. Tata Multicap Fund
5. Mirae Asset Mid Cap Fund

Also Read:

Public Provident Fund (PPF): మ్యూచువల్ ఫండ్స్‌ గురించి మనకు పెద్దగా తెలీదు.. ఎందుకులే అనుకుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో రిస్క్ ఉండదు. నెలకు రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే చాన్స్ ఉంది. 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

Also Read:

Senior Citizen Saving Scheme (SCSS): పీపీఎఫ్ కన్నా ఎక్కువ వడ్డీ కావాలని భావిస్తే అప్పుడు పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్)కు ప్రాధాన్యమివ్వొచ్చు. ఇందులో 8.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత అదిరిపోయే రాబడికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.