‘తెరి’ రీమేక్.. రవితేజ సరసన శృతిహాసన్

దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘తెరి’. 2016లో విడుదలైన ఈ సినిమాను ‘పోలీస్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి కూడా విడుదల చేశారు. అయితే, అప్పటికి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు మార్కెట్ లేదు. దీంతో, చాలా మందికి ఈ సినిమా గురించి తెలీలేదు. అందుకని, ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అది కూడా మాస్ మహారాజా రవితేజ హీరోగా. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం.

Also Read:

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘బలుపు’ తరవాత రవితేజ, శృతిహాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వాస్తవానికి ‘తెరి’లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి తెలుగులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా? లేదంటే శృతిహాసన్ ఒక్కరేనా అనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.