తప్పుదిద్దుకున్న జగన్ సర్కార్.. మ్యాటరేంటంటే..!

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల భవనాలను అధికార పార్టీ రంగుల్లోకి మార్చేస్తున్న సంగతి తెలిసిందే. చివరికి శ్మశానాలనూ వదలకుండా వైఎస్సార్సీపీ రంగులు వేసేశారు. అందులో భాగంగా అనంతరపురం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ రంగులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామ సచివాలయానికి రంగులు వేస్తున్న వీడియో వైరల్ అయింది. సచివాలయ గోడపై ఉన్న జాతీయ జెండాను సైతం వదలకుండా పార్టీ రంగులు వేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదేనా మీ దేశభక్తి అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. విపక్ష నేతలు సైతం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read:

ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. ఆ ఘటన వైఎస్సార్సీపీ నేతల దేశభక్తికి.. జాతీయ పతాకం పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ వీడియోను ట్వీట్ చేశారు. జాతీయ పతాకానికి కూడా పార్టీ రంగులు వేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతీయ జెండా రంగులపై పార్టీ రంగులు వేసిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది. త్రివర్ణ పతాకంపై వేసిన వైసీపీ రంగులను తొలగించి భవనానికి తెలుపు రంగు వేయించింది. ఘటనకు బాధ్యుడిని చేస్తూ తమ్మడపల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్.ప్రకాష్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.