టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైనల్ నిర్ణయం ఇదే!

టీడీపీలో ఎపిసోడ్‌కు ముగింపు పలికినట్లేనా.. వంశీ వైఎస్సార్‌సీపీలో చేరడం ఖాయమా.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా.. కేశినేని వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా.. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వల్లభనేని పార్టీ మారడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారేందుకే వంశీ మొగ్గు చూపారని.. నవంబర్ 3, 4 తేదీల్లో వైఎస్సార్‌సీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Read Also: దుకు

పార్టీ మారే విషయాన్ని వంశీ ఆఫ్ ది రికార్డ్ చెప్పినట్లు టాక్ నడుస్తోంది. టీడీపీలో ఉండలేని పరిస్థితని.. ఓ సీనియర్ నేత తనను ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీలో కొనసాగలేనని.. అందుకే వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారట. అనుచరులకు కూడా సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. అంతేకాదు గన్నవరం నియోజకవర్గ సమీక్ష రావాలని పిలుపు పంపినా.. రాలేనని తెగేసి చెప్పారట. అయితే పార్టీ మారే అంశంపై వల్లభనేని మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇదిలా ఉంటే వంశీతో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా చర్చలు జరిపారు. వల్లభనేని వంశీతో చర్చించామని.. ఇప్పుడు వంశీకి టీడీపీ అవసరం ఉందని.. టీడీపీకి కూడా వంశీ అవసరం అంతే ఉందని నాని వ్యాఖ్యానించారు. వల్లభనేని కూడా పోరాడి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆయనకు చెప్పాల్సింది చెప్పాం.. బంతి ఆయన కోర్టులోనే ఉంది.. తేల్చుకోవాల్సింది ఆయనేనన్నారు. అంతేకాదు వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అన్నారు. నాని వ్యాఖ్యల్ని బట్టి చూసినా పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై వల్లభనేని ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

వంశీ దీపావళి రోజు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వాట్సాప్‌లో పంపించారు. పార్టీతో పాటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఈ లేఖపై స్పందించిన చంద్రబాబు వంశీకి సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పార్టీ సీనియర్ నేతలు ఎంపీ కేశినేని, కొనకళ్లను రంగంలోకి దించగా.. వారు వల్లభనేనితో చర్చించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.