జైలులో చింతమనేనిని కలిసిన నారా లోకేష్

మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిశారు. గురువారం అమరావతి నుంచి ఏలూరు వెళ్లిన లోకేష్.. సబ్ జైలులో ఉన్న ప్రభాకర్‌తో ములాఖత్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేస్తున్నా.. ధైర్యంతో ఎదుర్కొంటున్న వారికి పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని.. న్యాయపోరాటం చేద్దామని లోకేష్.. చింతమనేని భరోసా ఇచ్చారు.

Read Also:

చింతమనేనిని పరామర్శించిన తర్వాత లోకేష్ దుగ్గిరాలలో ఆయన ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లోకేష్‌తో పాటూ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కూడా ప్రభాకర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

రెండు నెలల క్రితం చింతమనేనిపై కేసులు నమోదుకాగా.. కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో పరామర్శించేందుకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. తర్వాత బెయిల్‌ మంజూరుకాగా.. విడుదలయ్యే ముందు రోజు మరో కేసు నమోదయ్యింది. ఆ కేసులో కోర్టులో హాజరుపరచగా.. మళ్లీ రిమాండ్ విధించారు. వరుస కేసులతో చింతమనేని ఏలూరు సబ్ జైలులోనే ఉన్నారు. ప్రభాకర్‌ను కొద్దిరోజులుగా జిల్లా నేతలతో పాటూ టీడీపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఇప్పుడు కూడా కలిసి ధైర్యం చెప్పారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.