జగన్ టీమ్‌లోకి పీకే శిష్యుడు.. ఆ జీవో వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తోంది. పాలనాపరమైన కీలక నిర్ణయాలతో జగన్ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకమైన సలహాదారుల నియామకాలతో పాటూ.. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు. పార్టీతో పాటూ వైఎస్సార్‌సీపీ విజయంలో కీలకపాత్ర పోషించినవారికి నామినేటెడ్ పోస్టుల ద్వారా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also:

కొత్తగా ఇద్దరు చీఫ్ డిజిటల్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీవీ రెడ్డి, అనే ఇద్దరిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో బ్రహ్మానంద పాత్ర అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ ఐప్యాక్ టీమ్ సభ్యుడట. వైఎస్సార్‌సీపీ, జగన్‌కు సోషల్ మీడియా ప్రచారంలో పాత్ర కీలకపాత్ర పోషించారట. పాదయాత్ర, ఎన్నికల సమయంలో ప్రచారం, పాటలు, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం వంటివి చూసుకునేవారట.

ఎన్నికల ఫలితాల తర్వాత ఐప్యాక్ వైఎస్సార్‌సీపీకి కాస్త దూరంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ కూడా తిరిగి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఐప్యాక్ టీమ్‌లో సభ్యులు కూడా విడిపోయారు.. వేరే, వేరే పార్టీలకు సేవలు అందిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో బ్రహ్మానంద పాత్రకు కీలక బాధ్యతలు అప్పగించడం ఆసక్తిగా మారింది. అంతేకాదు ఈ నిర్ణయం వెనుక కచ్చితంగా జగన్ వ్యూహం ఉండొచ్చని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.