'జగన్‌ని నిద్రలేపి సీఎం అని గుర్తు చెయ్యండి రెడ్డి గారూ'

ఏపీలో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య ఇసుక దుమారం లేచింది. ఇరు పార్టీల నేతలు ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు ఘాటుగా ట్వీట్‌లు చేసుకుంటున్నారు. ఇసుక కొరతపై జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన దీక్షపై వైఎస్సార్‌సీపీ ఎంపీ సెటైర్లు పేలిస్తే.. ఎమ్మెల్సీ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. జగన్‌తో పాటూ ఎంపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read Also:

‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంటూనే 1300 కోట్లు ఖర్చుతో స్మశానాలకు కూడా పార్టీ రంగులు వేసుకుంటున్న వాడిని ఏమి అంటారు. విజయసాయిరెడ్డిగారు? ఒకవైపు రాష్ట్రం లోటులో ఉంది, అందుకే నవరత్నాల బదులు నవరత్న తైలం రాస్తున్నాం అని సొల్లు కబుర్లు చెప్తున్నారు’అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బుద్దా వెంకన్న.

‘ఒకవైపు ఇసుక దొరక్క, ఉపాధి కోల్పోయి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ, నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ నిద్రపోతున్న మీ తింగరి మాలోకం జగన్‌ని కాస్త నిద్రలేపి ఆయన ఈ రాష్ట్రానికి షీఎం అని గుర్తు చెయ్యండి విజయసాయిరెడ్డి గారు’అంటూ ఘాటు ట్వీట్ చేశారు.

‘దొంగ దీక్షలు చెయ్యడంలో మీ తింగరి మాలోకం జగన్‌కి పీహెచ్డీ వచ్చిన విషయం మర్చిపోయారా విజయసాయిరెడ్డి గారు? చెవులు చిల్లులు పడేలా బిల్డప్ సాంగులు, సొంత డబ్బాలో గ్రాఫిక్స్ మనుషులు, ప్రత్యేక బస్సులో దొంగ మేత అన్నీ ప్రజలకు తెలిసిన నిజాలే కదా. ఇక పాదయాత్ర అంటావా అదో భరించలేని అద్భుతం. రోజుకి 3 కిలోమీటర్ల నడక ,కేసుల పేరుతో వారానికి రెండు రోజులు లోటస్ పాండ్ లో విలాసం..ఆహా ఓహో!. దొంగ దీక్షలకు మీరు పేటెంట్ కలిగిన మాస్టారు అన్న విషయం గుర్తు పెట్టుకొని, దయచేసి ప్రజా సమస్యలను అపహాస్యం చెయ్యెదని మిమ్మల్ని కోరుతున్నా విజయసాయిరెడ్డి గారు’అన్నారు.

‘ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఏకం చేసిన మీ జగన్‌ని తింగరి మాలోకం అంటే ఎక్కడ ఉద్యోగం పీకేస్తాడో అన్న భయంతో లోకేష్ మీద రెచ్చిపోతున్నారు కదా విజయసాయిరెడ్డి గారు. ఆ భయంతో ఎం చెయ్యాలో తెలియక నిద్రలేచింది మొదలు లోకేష్ కి ఏమీ చేతకాదు అంటూ లోకేష్ పేరు జపం చేస్తున్నావ్ అంటే లోకేష్ ని చూసి ఎంత భయపడుతున్నావో అర్థం అవుతుంది వీసా గారు!! తప్పుడు పనులు చేసేవాళ్ళకి నిజాయితీగా బ్రతికే లోకేష్ ని చూస్తే ఆమాత్రం భయం ఉండాలిలే’అన్నారు

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.