చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోన్.. ఏంటి మ్యాటర్!

ఏపీలో ఇసుక వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. టీడీపీ ఈ వ్యవహారంపై ఇప్పటికే జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తే.. అధినేత పవన్ ఏకంగా ఈ నెల మూడున విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పనిలో పనిగా ప్రతిపక్షాలన్నిటిని ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరికి ఆయనే స్వయంగా ఫోన్లు చేసి.. లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలపాలని కోరారు. ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని నడిపేందుకు చొరవ తీసుకొని.. లాంగ్ మార్చ్‌కి సంఘీభావం ప్రకటించాలని కోరారు. , కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎంతో పాటూ మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాల నేతలకు ఫోన్లు చేశారు.

Read Also:

ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ‘ఇసుక అందుబాటులో ఉంచకపోవడంతో ఉపాధి కోల్పోయి అల్లాడిపోతూ అత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌ తో జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ నవంబర్‌ 3న విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించ తలపెట్టారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొనిఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్న శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు అన్ని పార్టీల అగ్ర నాయకులతో బుధవారం ఫోన్‌ లో మాట్లాడారు. బీజేపీ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారితో ఈ విషయమై ఫోన్‌లో మాట్లాడారు. అలాగే సీపీఎం కార్యదర్శి మధు.. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.. పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, లోక్‌ సత్తా అధ్యక్షులు డి.వి.వి.ఎస్‌.వర్మతో పాటూ మిగిలిన పలువురు నేతలతో పవన్‌ ఫోన్‌ లో మాట్లాడారు’.

విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్‌ మార్చ్‌ ఉద్దేశాన్ని, భవన నిర్మాణ కార్మికుల కష్టాలను తెలియచేశారు. లాంగ్‌ మార్చ్‌ లో పాల్గొనవలసిందిగా కోరారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంపై అన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందించినట్లు జనసేన ప్రకటనలో తెలిపింది. అలాగే మార్చ్‌ కు ఆహ్వానించినందుకు అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఇసుక విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.