గీతాంజలికి కన్నీటి నివాళి.. తీవ్ర భావోద్వేగానికి గురైన హేమ

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు.

గీతాంజలి నివాసంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని ‘మా’ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు సందర్శించి నివాళులర్పించారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అయితే, గీతాంజలి మృతి పట్ల నటి హేమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు.

Also Read:

మరోవైపు గీతాంజలికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘క్షణంలో జీవితం ఏమైపోతుందో అర్థంకాని విషయం. ఈరోజు భోజనానికి వస్తానని చెప్పిన మనిషి ఏకంగా స్వర్గానికి వెళ్లిపోవడం చాలా బాధగా అనిపించింది. అందరూ పోవాల్సినోళ్లమే.. కానీ, హఠాత్తుగా పోయినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఎంతో ఉత్తమురాలు, మంచి మనిషి. ఆమె తప్పకుండా స్వర్గానికే వెళతారు. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.