గర్భం దాల్చావ్, నీ భర్త ఎక్కడ అని అడుగుతున్నారు: నటి

బాలీవుడ్ నటి పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మరికొన్ని నెలల్లో కల్కి పండంటి బిడ్డకు జన్మనిస్తారు. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి, ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కల్కి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నా ప్రెగ్నెన్సీ గురించి ఎవ్వరికీ తెలీకూడదు అనుకున్నాను. ఈ విషయం నా మేకప్ మ్యాన్‌కు మాత్రమే తెలుసు. సెట్‌లో ఎవ్వరికీ ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను. నా మేకప్ మ్యాన్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది పొట్ట పెరుగుతూ వచ్చింది. డ్రెస్సులు పట్టడంలేదు. దాంతో ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవడం ప్రారంభించా. ఇక నాలుగో నెల రాగానే నేను చెప్పకపోయినా అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అందుకే నేనే చెప్పాలనుకున్నాను. నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ సోషల్ మీడియా ట్రోల్స్‌ని మాత్రం తట్టుకోలేకపోయా. నీ భర్త ఎక్కడ? ఎప్పుడు గర్భం దాల్చావ్? ఇలాంటి దుస్తులు వేసుకోకు అంటూ ప్రశ్నలు వేసేవారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాయని తెలిసి నా బాయ్‌ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు’

‘ మొదటి నెలలో ఏమీ తినలేకపోయేదాన్ని. ఆ తర్వాత బేబీ కోసం కష్టపడి తినడం నేర్చుకున్నాను. గర్భం దాల్చినా కూడా నేను వర్క్ నుంచి దూరంగా ఉండాలనుకోలేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే డిప్రెస్ అయిపోతాను. నేనెప్పుడూ బిజీగా ఉండాలనుకునే వ్యక్తిని. అందుకే మొదటి మూడు నెలలు షూటింగ్‌లో బిజీగా గడిపాను. ఇప్పుడు ఎటూ అందరికీ తెలిసిందే కాబట్టి నాకు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. కాకపోతే నేనే ఆలోచించి మరీ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను. ఇక నాకు పుట్టబోయే బిడ్డ విషయానికొస్తే ఇప్పటికే మేం ఓ పేరును అనుకుంటున్నాం. ఆ పేరు పాపకి బాబుకి సరిగ్గా సరిపోతుంది’

‘కానీ ఆ పేరు ఇప్పుడే చెప్పదలచుకోలేదు. నేను బేబీ కోసం కొత్త డ్రెసెస్ కొనాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నా చిన్నప్పటి దుస్తులను మా అమ్మ దాచి ఉంచింది. అవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నా బేబీకి కూడా అవే వాడాలని అనుకుంటున్నాను. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఈ ఆలోచనా విధానం మారాలి. కామెంట్ చేసేవాళ్లు మనం ఎంత మంచివాళ్లమైనా చేస్తూనే ఉంటారు. అలాంటి సమాజం కోసం మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇష్టాలను చంపుకోవాల్సిన అసవరం లేదు’ అని వెల్లడించింది కల్కి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.