క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి భారీ షాక్.. రూ.7,000కు మీ కార్డు వివరాలు అమ్మకానికి!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదంటే డెబిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే మీకు ఝలక్. మీ డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. డార్క్‌నెట్ మార్కెట్‌ప్లేస్ అయిన జోకేర్స్ స్టాష్‌లో ఏకంగా 13 లక్షల క్రెడిట్, డెబిట్ కార్డు డేటా అమ్మకానికి ఉంది. సింగపూర్‌కు చెందిన గ్రూప్ ఐబీ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

13 లక్షల కార్డుల్లో భారత్‌కు చెందినవే 98 శాతం ఉండొచ్చని గ్రూప్ ఐబీ అంచనా వేస్తోంది. స్కిమ్మింగ్ మార్గంలో కార్డు వివరాలు తస్కరించి ఉంటారనే అంచనాలున్నాయి. ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్లలో స్కిమ్మింగ్ ద్వారా డేటా దొంగలించి ఉండొచ్చని గ్రూప్ ఐబీ తెలిపింది.

2019 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 97.17 కోట్ల కార్డులు (, క్రెడిట్ కార్డులు) చెలామణిలో ఉన్నాయి. డేటాను విక్రయిస్తున్న మోసగాళ్ల ప్రకారం.. వారి వద్ద ట్రాక్ 1, ట్రాక్ 2 డేటా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డేటా ట్రాన్సాక్షన్స్ లేదా కార్డ్స్ క్లోనింగ్‌ చేయవచ్చు.

Also Read:

గ్రూప్ ఐబీ రీసెర్చర్స్ ప్రకారం.. మోసగాళ్లు ఒక్కో కార్డు వివరాలను 100 డాలర్లకు విక్రయిస్తున్నారు. మన కరెన్సీలో ఒక కార్డు వివరాలు కావాలంటే రూ.7,000 చెల్లించాలి. అంటే మొత్తం 13 లక్షల కార్డులకు 130 మిలియన్ డాలర్లు అవుతాయి. కార్డు వివరాల అమ్మకం విషయాన్ని అధికారులకు తెలియజేశామని గ్రూప్ ఐబీ ఫౌండర్, సీఈవో లియా శాచ్‌కోవ్ తెలిపారు.

Also Read:

కాగా మనదేశంలో డేటా తస్కరణ జరిగిందని వెల్లడించే చట్టాలు లేవు. యూరప్ సహా ఉత్తర అమెరికా దేశాల్లో డేటా తస్కరణ జరిగితే ఆ విషయాన్ని సంస్థలు 24 గంటలలోగా రెగ్యులేటర్స్‌కు, కస్టమర్లకు, ఇతర సంబంధిత నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read:

మన దేశంలో ఇలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. దీంతో కస్టమర్ల డేటాకు రక్షణ లేకుండాపోతోంది. ఇకపోతే బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా తస్కరణను ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏ బ్యాంక్ స్పందించలేదు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.