‘కోయిలమ్మ’ అక్టోబర్ 29 ఎపిసోడ్‌ : అందరి ముందు సమీర్ చెంపలు వాయించిన అమర్ ‘ఏం కూసావ్ రా?’

చిన్నీ జీవితం నాశనం చేయాలని ఇంద్రజ, సింధూలు వేస్తున్న ప్లాన్స్ అన్నీ బెడిసికొడుతున్నాయి. ఒక వైపు చిన్నీకి సమీర్ సపోర్ట్‌గా ఉండటం, మరో వైపు రమేష్ చంద్ర చిన్నీ అమాయకత్వాన్ని అర్థం చేసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంతో కథ ఆసక్తిగా మారింది. సరికొత్త రాగాలను పలిగిస్తున్న కథ (అక్టోబర్‌ 29) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం!

గత ఎపిసోడ్‌లో జరిగిన కథ..మనోరమా కావాలనే ఇంద్రజకు ఫోన్ చేసి.. సింధూని సమీర్ బయటికి గెంటేసాడని, బయటే కూర్చుని ఉందని.. చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అయితే అంతకు ముందే రమేష్ చంద్ర దగ్గరకు వెళ్తున్నానని లక్ష్మీ చెప్పడంతో.. లక్ష్మీనే సింధూ గురించి చెడుగా చెప్పి ఉంటుందని.. అందుకే సమీర్ సింధూని బయటికి గెంటేశాడని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ‘అక్కా.. రమేష్ చంద్రగారికి ఏం చెప్పావో చిన్నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టు పెట్టి చెప్పు అక్కా’ అనడంతో చేసేది లేక అంతా చెప్పేస్తుంది లక్ష్మీ. దాంతో ఇంద్రజా లక్ష్మీని తిట్టి.. అశోక్ కుమార్‌కి బాగా ఎక్కించి మనోజ్ తీసుకుని సింధూ దగ్గరకు పరుగుతీస్తుంది ఇంద్రజ.

700 ఎపిసోడ్‌లో హైలైట్స్‌..చిన్నీ అమర్ దగ్గరకు వెళ్లి.. ‘ఏమండీ.. మీరైనా చెప్పండి సింధూని పిలవమని సమీర్‌కి’ అంటుంది. అమర్ కోపంగా చూస్తాడు. ‘అయినా సింధూ అలా మాట్లాడటం, సమీర్ అలా రియాక్ట్ అవ్వడం రెండూ తప్పు కదండీ’ అంటుంది. కాదంటాడు అమర్. చిన్నీ షాక్ అవుతుంది. ‘తప్పు కాదా? మరి ఎవరిది తప్పు?’ అంటుంది బాధగా చూస్తూ.. ‘నీది’ అంటాడు అమర్. చిన్నీ మరో సారి షాకింగ్ చూస్తుంది. ‘నువ్వు తల్లి కాబోతున్న విషయం మొదట సమీర్ చెప్పి తప్పు చేశావు. నాకు చెప్పాల్సిన విషయం తనకి చెప్పి భార్య భర్తలు విడిపోవడానికి కారణం అయ్యావ్’ అంటాడు అమర్. ‘నేను సమీర్‌కి కావలని చెప్పలేదండీ.. డాక్టరే’ అంటూ నిజం చెప్పబోతుంటే.. వినకుండా వెళ్లిపోతాడు అమర్.

సింధూని లోపలికి రమ్మని చిన్నీ బతిమలాడుతుంది. అయితే ‘నేను ఇక్కడుంటే సమీర్‌తో నీకు ఉన్న పూర్వ సంబంధం బయటపడుతుందని భయపడుతున్నావా? నేను రాను’ అంటూ ఉంటుంది. ఇంతలో ఇంద్రజా, మనోజ్ కుమార్ ఇద్దరూ కారులో వస్తారు. రావడమే ‘సమీర్ సమీర్’ అని అరుస్తాడు మనోజ్ కుమార్. లోపలి నుంచి సమీర్‌తో సహా అంతా వస్తారు. ‘ఇందుకే సింధూని పెళ్లి చేసుకుంది’ అంటూ నిలదీస్తాడు మనోజ్ కుమార్ సమీర్‌ని. సమీర్ మౌనంగా ఉండటంతో.. ‘నా కూతురు ఏ తప్పు చేయదు. అయినా ఎందుకు బయటికి గెంటేశావ్?’ అని అడుగుతాడు. దాంతో సమీర్ ఆవేశంగా… ‘మీ కూతురు తప్పు చేయదేమో.. నా భార్య తప్పు చేసింది.. ఆ తప్పు చేసి నా భర్యగా సింధూ చచ్చిపోయింది’ అంటాడు. దాంతో అమర్.. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా.. సింధూ చచ్చిపోయిందా? ఇంకో సారి అంటావా ఆ మాట’ అంటూ చెంపలు వాయిస్తూనే ఉంటాడు. ఇంతలో రమేష్ చంద్ర వచ్చి అమర్‌ని ఆపి ఏం జరిగింది అంటూ నిలదీస్తాడు.

రమేష్ చంద్ర ఇన్‌వాల్వ్ కావడంతో.. ‘గొడవ ఇంటి పెద్దకు తెలియదని అర్థం అవుతుంది. సింధూ.. నీ సమస్యని తండ్రి లాంటి మీ మామగారికి చెప్పుకో.. ఆయనే చక్కబెడతానే నమ్మకం ఉంది నాకు. లేదంటే నేను ఆ తర్వాత కలుగజేసుకుంటాను. అధైర్యపడకు’ అని చెప్పి ఇంద్రజను తీసుకుని మనోజ్ కుమార్ వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే.. సమీర్ రమేష్ చంద్ర దగ్గరకు వెళ్లి.. అమర్ కొట్టినందుకు.. సింధూ చేసిన తప్పు గురించి చెప్పి ఏడుస్తాడు. ‘నేను ఉన్నాగా.. నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను’ అని చెప్పి ఓదారుస్తాడు రమేష్ చంద్ర.

సింధూ దగ్గరకు వెళ్లిన ఆయన.. ‘చిన్నప్పటి నుంచి నీకు చిన్నీకి మధ్య జరిగిన అన్నీ విషయాలు నాకు తెలుసు’ అంటూ నిలదీస్తున్నాడు. సింధూ షాక్ అవుతుంది. ‘నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుని.. చిన్నీకి, సమీర్‌కి, అమర్‌కి సారీ చెబితే ఈ ఇంటి కోడలుగా ఉంటావ్. లేదంటే ఊరుకోను’ అని వార్నింగ్ కూడా ఇస్తాడు. దాంతో కంగారు పడిన సింధూ ఇంద్రజకు కాల్ చేస్తుంది. ఇంద్రజా ఏదో సలహా ఇచ్చి ‘వెంటనే బయలుదేరు’ అంటుంది. దాంతో సింధూ కారు వెళ్తుంది. పైనుంచి చూసిన రమేష్ చంద్ర.. ‘ఇంత నైట్ సింధూ ఎక్కడికి వెళ్తుంది?’ అనుకుంటూ వెనుకే కారులో బయలుదేరతాడు రమేష్ చంద్ర.

కమింగ్‌ అప్‌లో..సింధూ, ఇంద్రజాలు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు.‘అనవసరంగా మనకి అడ్డం పడితే వెంటనే ఆయన్ని అడ్డు తొలగించుకోవాలి’ అంటూ ఉంటుంది. అదంతా రమేష్‌ చంద్ర వీడియో తీసి.. వాళ్ల దగ్గరకు వెళ్లిన రమేష్‌ చంద్ర వాళ్లని నిలదీయడంతో.. సింధూ అడ్డు పడుతున్నా ఇంద్రజా ఆగకుండా రమేష్‌ చంద్రకు సారీ చెబుతూనే సెల్‌ ఫోన్‌ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పెనుగులాటలో రమేష్‌ చంద్ర కింద పడి తలపగులుతుంది. అక్కడికి చిన్నీ వస్తుంది. పోలీస్‌లు కూడా వస్తారు. చిన్నీని అరెస్ట్‌ చేసి తీసుకునిపోతారు. మొత్తానికి ఇంద్రజ దెబ్బకు ఇటు చిన్నీ, అటు లక్ష్మీ ఇద్దరూ బలైనట్లు అర్థమవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కోయిలమ్మ కొనసాగుతోంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.