కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 671 ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత, తగు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..
Dont Miss:

✪ వర్క్‌మెన్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 671
పోస్టుల కేటాయింపు..

కేటగిరీ పోస్టులు
జనరల్ 341
ఓబీసీ 183
ఎస్సీ 84
ఎస్టీ 03
ఈడబ్ల్యూఎస్ 60

Read Also:

విభాగాల వారీగా ఖాళీలు..

విభాగం ఖాళీలు
ఫ్యాబ్రీకేషన్ అసిస్టెంట్స్
షీట్ మెట‌ల్ వ‌ర్కర్‌ 17
వెల్డర్‌ 30
అవుట్‌ఫిట్ అసిస్టెంట్స్
ఫిట్టర్‌ 214
మెకానిక్ డీజిల్‌ 22
మెకానిక్ మోటార్ వెహికిల్‌ 07
ఫిట్టర్ పైప్‌(ప్లంబ‌ర్‌) 36
పెయింట‌ర్‌ 05
ఎల‌క్ట్రీషియ‌న్‌ 85
క్రేన్ ఆప‌రేట‌ర్‌ (EOT) 19
ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌ 73
ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌ 78
షిప్‌రిట్ వుడ్ 02
ఆటో ఎలక్ట్రీషియన్ 02
స్కాఫోల్డర్ 19
ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్ 02
సెమీ స్కిల్డ్ రిగ్గర్ 40
జ‌న‌ర‌ల్ వ‌ర్కర్‌ 20
మొత్తం పోస్టులు 671

Dont Miss:

Read Also:

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉండాలి. అనుభ‌వం తప్పనిసరి.

వ‌య‌సు: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 30 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100
. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా, ప్రాక్టిక‌ల్‌/ స్కిల్/ ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2019

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2019

Read More..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.