కేసీఆర్ వ్యాఖ్యలతో మాలో కసి పెరిగింది.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి . వచ్చే ఆరు నెలలోపే కచ్చితంగా విలీన హామీని నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పామని.. ఆ హమీని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. ఆర్టీసీ విలీనంపై స్పందించారు.

తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనిస్తున్నామని చెప్పారు పేర్ని నాని. వ్యవస్థల్ని ప్రవేట్ పరం చేస్తున్న రోజుల్లో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని మంత్రి ప్రస్తావించారు. విలీనంపై ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని కేసీఆర్ వ్యాఖ్యలతో తమకు కసి, బాధ్యత పెరిగింది అన్నారు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకున్నామని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ తెలంగాణ సమ్మెపై మాట్లాడుతూ.. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై స్పందించారు. ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ప్రయోగం మాత్రమే చేశారని.. అక్కడ పెద్దగా చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంశంపై ఒక కమిటీ వేశారని.. ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి మూడు నెలల సమయం పడుతుందన్నారు. అందువల్ల ఏపీలో విలీన అంశంపై స్పష్టత రావడానికి మూడు నెలలో, ఆరు నెలలో పడుతుందని చెప్పుకొచ్చారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.