కేంద్రం గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.50,000 వరకు ప్రయోజనం! వారికి మాత్రమే?

సొంతింటి కల సాకారం చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు తీపికబురు అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. వీరికి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను కూడా ఆదుకోవాలని చూస్తోంది.

జీ బిజినెస్ టీవీ నివేదిక ప్రకారం.. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవాలని ఆర్థిక మంత్రిత్వ భావిస్తోంది. రియల్టీ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో ఈ నిర్ణయం వెలువడొచ్చనే అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల అంశమని చెప్పొచ్చు.

Also Read:

అలాగే ఈ నిర్ణయం వల్ల చాలా మందిపై ప్రభావం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తే.. అప్పుడు వారికి ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సింపుల్‌‌గా చెప్పాలంటే కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే.. ట్యాక్స్ రిబేట్ వస్తుంది. దీంతో వారికి రూ.50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.

Also Read:

‘ఒకవేళ మీరు హోమ్ లోన్‌ రూపంలో ఏడాదిలో రూ.5 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటే మీకు మీరు చెల్లించే పన్నులో దాదాపు రూ.50,000 లేదా 10 శాతం ఆదా కలుగుతుంది’ అని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు.

Also Read:

2020 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి రావొచ్చని తెలుస్తోంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే వారికి తీసుకున్న లోన్‌పై తొలి మూడు సంవత్సరాలపాటు ట్యాక్స్ రిబేట్ లభించొచ్చు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావం పడే అవకాశముంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.