కీలక సూత్రధారి కీర్తి కొత్త ప్రియుడే… మద్యం తాగించి ఆమెనూ ముంచేశాడు

ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డి(19) ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. కాబోయే భర్తతో గర్భం దాల్చిన కీర్తి… అబార్షన్ చేయించుకునేందుకు శశికుమార్ అనే యువకుడి సాయం తీసుకోవడం, అతడి ప్రోద్బలంతోనే తల్లిని పాశవికంగా చంపేసినట్లు తెలుస్తోంది.

Also Read:

కీర్తి గతంలో బాల్‌రెడ్డి అనే యువకుడితో ప్రేమాయణం నడపగా రెండు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం జరిపించారు. ఈ క్రమంలో కీర్తి అతడితో శారీరకంగా దగ్గరై గర్భం దాల్చింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె తన పక్కింట్లో ఉండే శశికుమార్ సాయం తీసుకుని మహబూబ్‌నగర్‌లో అబార్షన్ చేయించుకుంది. కీర్తిపై కన్నేసిన శశికుమార్ ఈ విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి తన మాట వినకపోతే వాటిని బయటపెడతానని బెదిరించసాగాడు.

Also Read:

బెదిరింపులతో శశికుమార్‌‌కు దగ్గరైన కీర్తికి తర్వాత పూర్తిగా అతడి మాయలో పడిపోయింది. కొత్త ప్రియుడి మోజులో బాల్‌రెడ్డిని దూరం పెట్టింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శశికుమార్‌ను రప్పించుకుని ఏకాంతంగా గడిపేది. ఇద్దరూ షికార్లంటూ విచ్చలవిడిగా తిరిగేవారు. ఈ క్రమంలో కూతురి బాగోతం తెలుసుకున్న తల్లి రజిత.. ఒకరితో నిశ్చితార్థం జరిగాక మరొకరితో ప్రేమేంటని నిలదీసింది. ఇదే విషయమై శశికుమార్‌ను హెచ్చరించింది. దీంతో రజితను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్న శశి.. కీర్తిని రెచ్చగొట్టాడు. ఈ నెల 19వ తేదీన కీర్తితో బీరు తాగించిన అతడు.. రజితను హత్యచేసేలా ప్రేరేపించాడు. ఈ క్రమంలోనే రజిత తలపై కీర్తి దిండుపెట్టగా.. శశి చున్నీతో గొంతు బిగించి చంపేశాడు. ప్రియుడి ప్లాన్ ప్రకారం.. కీర్తి ఈ నేరాన్ని తండ్రిపై నెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. దీంతో కీర్తి, శశికుమార్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. కీర్తి ఇంట్లో నుంచి మూడు బీర్ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఈ హత్యలో ఇంకెవరి హస్తమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.