కాల్ రికార్డుల్లో గుట్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందన, కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తాను డబ్బు డిమాండ్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఆడియోలు బయటపెట్టాలని మంత్రి మల్లారెడ్డి సవాలు విసిరారు. రాపోలుతో సంభాషించిన కాల్ రికార్డులు బయటపడ్డ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందించారు. బోడుప్పల్‌కు చెందిన కొంత మంది నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. వారు మొదటి నుంచి పార్టీలో లేరని, ఇటీవల సార్వత్రిక ఎన్నికల అనంతరం చేరారని చెప్పారు. వారికి టికెట్లు ఇచ్చినా గెలిచే సత్తా లేదని, అధిష్ఠానం సూచనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించారు. అన్ని సర్వేలను పరిగణనలోకి తీసుకొనే తుది నిర్ణయానికి వచ్చామని చెప్పారు.

Also Read:

రాపోలు రాములుతో జరిగిన ఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ.. ఆ ఆడియోలో ఏమైనా తప్పుందా అని ప్రశ్నించారు. దమ్ముంటే డబ్బులు తీసుకున్నట్లుగా రుజువు పర్చే ఆడియోలు బహిర్గత పర్చాల్సిందిగా మంత్రి రాపోలుకు సవాలు విసిరారు. తన నియోజకవర్గంలోనే పోటీ ఎక్కువగా ఉన్నందున ఇక్కడి నుంచే వివాదాలు చెలరేగుతున్నాయని విశ్లేషించారు. టికెట్లు కేటాయించనందుకు రెబెల్స్ తనను దూషించడం సమంజసమేనని, వాటిని తాను ఆశీర్వాదాలుగానే స్వీకరిస్తానని మల్లారెడ్డి చెప్పారు. ఇక రెబెల్స్ సమస్య ఉన్నది వాస్తవమేనని, కనీసం వారు కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సైతం వెనుకాడుతున్నారని మంత్రి అన్నారు. ఆ పార్టీ మునుగుతున్న నావ అని ఎద్దేవా చేశారు.

Also Read:

మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతోంది. తన తరపు వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై రాపోలు రాములు మంత్రిని ఫోన్‌లో నిలదీశారు. ‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. అయినా, రాపోలు వినలేదు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.