ఓరినాయనో.. బంగారం, వెండిని ఎగబడి కొనేస్తున్న జనాలు..!

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. అందుకే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. మరీముఖ్యంగా పండుగ సందర్భాల్లో బంగారం డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. పండుగ పర్వదినాల్లో కస్టమర్లు ఎక్కువగా బంగారం కొంటుంటారు.

ఈసారి పండుగ సీజన్‌లో కూడా ఇదే జరిగింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) సోమవారం 30 నిమిషాలపాటు స్పెషల్ ముహురత్ ట్రేడింగ్ నిర్వహించింది. ఇందులో ఏకంగా 100 కేజీల బంగారం, 600 కేజీల వెండి విక్రయమైంది. చూశారుగా డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో.

Also Read:

గతేడాది ముహురత్ ట్రేడింగ్‌తో పోలిస్తే ఈసారి బంగారం, వెండి అధిక ధరకు విక్రయమైందని ఐబీజేఏ నేషనల్ సెక్రటరీ సురేశ్ మెహతా తెలిపారు. ఐబీజేఏ ప్రకారం.. సోమవారం స్పెషల్ ముహురత్ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.38,666గా ఉంది. ఇకపోతే ధంతేరాస్ రోజున బంగారం ధర రూ.38,725 వద్ద ఉండటం గమనార్హం.

Also Read:

ఇక వెండి విషయానికి వస్తే ధంతేరాస్ రోజుతో పోలిస్తే సోమవారం ధర కొంత మేర తగ్గింది. కేజీకి రూ.24 దిగొచ్చింది. సోమవారం కేజీ రూ.46,751 వద్ద ఉంది. ధంతేరాస్ రోజున ఈ ధర రూ.46,775 వద్ద కొనసాగింది.

Also Read:

స్పెషల్ ముహురత్ ట్రేడింగ్ సోమవారం ఉదయం 11.56 నుంచి మధ్యాహ్నం 12.28 వరకు జరిగింది. ఇందులో 100 కేజీల బంగారం, 600 కేజీల వెండి విక్రయమైందని మెహతా తెలిపారు. అదే ధంతేరాస్ రోజున కేవలం 30 కేజీల బంగారం మాత్రమే విక్రయమైందని పేర్కొన్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.