ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. నవంబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు..

Read Also:

ఖాళీల సంఖ్య: 38

1) మేనేజర్: 09

విభాగం: ఫైనాన్స్.

అర్హత: సీఎ/సీఎంఏ (లేదా) 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో బీటెక్‌తో పాటు ఎంబీఏ/ పీజీడీఎం ఉండాలి.

అనుభవం: 3 సంవత్సరాలు.

Read Also:

2) డిప్యూటీ మేనేజర్: 03

విభాగం: ఫైనాన్స్.

అర్హత: సీఎ/సీఎంఏ (లేదా) 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో బీటెక్‌తో పాటు ఎంబీఏ/ పీజీడీఎం ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాలు.

Read Also:

3) అసిస్టెంట్ మేనేజర్: 16

విభాగం: ఫైనాన్స్.

అర్హత: సీఎ (ఇంటర్)/సీఎంఏ (ఇంటర్) 60 శాతం మార్కులతో ఎంబీఏ/ పీజీడీఎం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్ ఫైనాన్షియల్ మోడలింగ్) తప్పనిసరి.

అనుభవం: ఏడాది.

4) అసిస్టెంట్ మేనేజర్: 05

విభాగం: టెక్నికల్.

అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్, కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్/ఫైనాన్షియల్ మోడలింగ్) తప్పనిసరి.

అనుభవం: ఏడాది.

Read Also:

5) అసిస్టెంట్ మేనేజర్: 05

విభాగం: లా.

అర్హత: ప్రథమ శ్రేణిలో డిగ్రీ/ పీజీ లా డిగ్రీ (బిజినెస్/ కమర్షియల్ లా)

అనుభవం: 3 సంవత్సరాలు.

Read Also:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2019.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2019.

Read More..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.