ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్టెప్పులు.. వీడియో వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం డ్యాన్స్‌తో అదరగొట్టారు. విద్యార్థుల్ని ఉత్సాహపరించేందుకు వారితో కలిసి సరదాగా నాలుగు స్టెప్పులేశారు. విశాఖలోని మరికవలలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతితో పాటూ స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విద్యార్థులు పరిశోధనాత్మకను పెంపొందించుకోవాలని పుష్ప శ్రీవాణి అన్నారు. కొత్త, కొత్త ఆలోచనలతో మానవాళిని పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలకు ముందుకు రావాలి అన్నారు.

ఎగ్జిబిషన్‌కు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా.. పక్కనే ఉన్న పుష్పశ్రీవాణిని కూడా డ్యాన్స్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె కూడా విద్యార్థుల్ని ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డ్యాన్స్‌తో అదరగొట్టడమే కాదు.. పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో కూడా క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలుపుతూ అమృత భూమి అనే సినిమా తీస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా రూపొందిస్తుండటం.. సందేశాత్మకమైన సినిమా కావడంతో ఆమె కూడా క్యారెక్టర్ చేసేందుకు అంగీకరించారట. పుష్ప శ్రీవాణి ఈ సినిమాలో టీచర్ పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ హరిజవహర్ లాల్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడలో మూవీ షూటింగ్ జరిగింది. షూటింగ్‌లో భాగంగా సినిమా నటులతో కలిసి డిప్యూటీ సీఎం, కలెక్టర్లపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.