‘ఈ నటిని నేను చంపలేదు, మీడియా చెప్పిందంతా అబద్ధం’

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు మీడియా వర్గాలు రాసినదంతా అబద్ధమేనని అంటున్నారు బాలీవుడ్ నటుడు . జియా, సూరజ్ చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఏడేళ్ల క్రితం జియా తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. దాంతో జియా తల్లి రాబియా తన కుమార్తె చావుకు కారణం సూరజేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సూరజ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఏడేళ్లు అవుతున్న ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఇక తాను న్యాయం కోసం ఎదురుచూడలేకపోతున్నానని సూరజ్ బాధపడుతున్నారు.

దీని గురించి తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘నేను జియాను చంపలేదు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు బాలీవుడ్ మీడియా వర్గాలు రాసినదంతా అబద్ధం. మీరు కేవలం జియా తల్లి చెప్పిన మాటల్ని విని నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. అసలేం జరిగిందని నన్ను ఒక్కరూ ప్రశ్నించలేదు. నేను కూడా స్పందించలేదు. ఎందుకంటే నేను అమాయకుడినని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో నిజం ఏంటో తెలియాలని నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ మీడియా నాకు ఆ న్యాయం ఇవ్వలేదు. కేవలం న్యాయస్థానం మాత్రమే నాకు న్యాయం చేయగలదు. ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయింది. కానీ కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇదంతా నా కెరీర్‌పై ప్రభావం చూపుతోంది’

‘ దీని వల్ల నేనే కాదు నా కుటుంబం కూడా చాలా బాధపడుతోంది. జియా తల్లి రాబియాకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది. దాంతో సరిగ్గా కోర్టులో నా వాదన సమయం వచ్చే సరికి ఆమె బ్రిటన్ వెళ్లిపోతున్నారు. నాపై కేసు పెట్టింది ఆవిడే కదా. మరి ఎందుకు కోర్టుకు రావడంలేదు. బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన ఏదైనా చేయొచ్చు అనుకుంటోంది. నాపై లేని పోని నిందలు వేసి ఇలా తప్పించుకు తిరగడం ఆమెకు మర్యాదగా అనిపించుకోదు. కేసుపై ఎలాంటి తీర్పు రాకపోవడంతో అందరూ నన్ను బ్యాడ్ బాయ్ అనుకుంటున్నారు. త్వరలో ఈ వివాదం నుంచి నేను బయటపడాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను’ అని వెల్లడించారు సూరజ్.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.