ఈవెంట్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. నిజంగా 50 కేజీ తాజ్‌మహలే

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అందాన్ని పొగడటానికి మాటలు చాలవు. అందుకే ఏ.ఆర్ రెహమాన్ ఆమెను ‘50 కేజీ తాజ్‌మహల్’తో పోల్చాడు. ఐష్‌కు వయసు పెరిగే కొద్ది అందం రెట్టింపవుతూనే ఉంది అనడానికి ఈ ఫొటోన ఎగ్జాంపుల్. ఓ ఈవెంట్ షో కోసం ఐష్ రోమ్ వెళ్లారు. వైట్ బాల్ గౌన్‌లో ర్యాంప్ వాక్ చేశారు. దీనిని ప్రముఖ లెబనీస్ డిజైనర్ జయాద్ జెర్మానోస్ డిజైన్ చేశారు. మేకప్ మరీ ఎక్కువగా లేకుండా చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ముస్తాబయ్యారు. ఈ ఫొటోలను ఐష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఒక్క లైక్‌తో ఆమె అందాన్ని వర్ణించలేక కామెంట్స్ సెక్షన్‌ను కాంప్లిమెంట్స్‌తో నింపేస్తున్నారు.

మాజీ మిస్ వరల్డ్ అయిన ఐష్‌ను నాలుగు పదుల వయసులోనూ అందానికి పర్యాయపదంగా ఆమె పేరును వాడుతుంటారు. ఐష్ అందం తగ్గిపోతుంది అన్న మాట ఇప్పటివరకు ఎవరి నుంచి రాలేదు. అభిమానుల కోసమే ఐష్ ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచారు. రోజుకో ఫొటోతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు. అన్నట్టు రేపు 45వ బర్త్‌డే. రోమ్‌లోనే తన భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌లతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక ఐష్ వర్క్ విషయానికొస్తే చివరిగా ఆమె ‘ఫ్యాన్నే ఖాన్’ చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె చోళా రాజ్య మహారాణి నందిని పాత్రను పోషిస్తున్నారు. ఐశ్వర్య భర్త పాత్రలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. ఆరాధ్య పెద్ద అవుతుండడంతో ఐష్ సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే నిదానంగా సినిమాలకు సంతకం చేస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించని ‘ఇరువర్’ సినిమాతోనే ఐష్ తన కెరీర్‌ను ప్రారంభించారు కాబట్టి ఆయన తన సినిమాలో చేయమని అడగ్గానే కాదనలేకపోయారు. చాలా కాలం తర్వాత ఐష్‌ను తమిళ ప్రేక్షకులు వెండితెరపై చూడబోతున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.