‘ఆ సినిమాలో నగ్నంగా నటించాల్సి వచ్చింది, అమ్మానాన్నకు తెలిసి..’

కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడినా.. ఇప్పుడు స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు . 2010లో వచ్చిన ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ అనే సినిమాతో రాజ్‌కుమార్‌కు బ్రేక్ వచ్చింది. అయితే సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుంది. అందుకే ఇందులో నగ్నంగా నటించాలని దర్శకుడు దివాకర్ బెనర్జీ చెప్పినప్పుడు తప్పకుండా నటిస్తానని ఒప్పుకున్నాడట. సినిమా కోసమే కాబట్టి ఒప్పేసుకున్నాడు కానీ తన తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాడట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘నగ్నంగా నటించబోతున్నానని నా తల్లిదండ్రులతో చెప్పాలనుకున్నాను. ఏదైతే అదైంది అనుకుని వెళ్లి ధైర్యంగా నాకో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాను. వారు చాలా సంతోషించారు. కాకపోతే సినిమాలో నగ్నంగా నటించాల్సిన సన్నివేశాలు ఉన్నాయని చెప్పాను. దాంతో వారు షాకయ్యారు. ఆ తర్వాత వారిని ఎలాగైనా కన్విన్స్ చేయాలనుకున్నాను. నా ముందు భాగం ఎవ్వరికీ కనిపించదు. కేవలం వెనక భాగం మాత్రమే చూపించాలి అని చెప్పాను. అప్పుడు వారు ఓకే అనుకున్నారు. ఎందుకంటే ఇదంతా సినిమాలో భాగమే. అది కూడా నటనే. ఆ తర్వాత ఈ టాపిక్ గురించి వారు నాతో ఎప్పుడూ చర్చించలేదు. ఆ తర్వాత షాహిద్, ఒమర్టా అనే సినిమాల్లోనూ నేను నగ్నంగా నటించాను. ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాలని నేను సినిమాల్లోరి రాకముందు నుంచే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే హీరో అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎక్కువగా బయట తిరిగేవాడిని. అందరితో గొడవలు పడుతుండేవాడిని. హీరోగా ఫైట్లు చేసేవాడిని. కావాలనే గొడవలు పెట్టుకుని ఫైట్లకు దిగేవాడిని. కాకపోతే నేను గూండా కాదనుకోండి. జస్ట్ ఫిల్మీ కిడ్ అంతే’ అని చెప్పుకొచ్చాడు రాజ్‌కుమార్ రావు.

రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ చైనా’ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.